21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
హెల్త్

Cold and cough : జలుబు, దగ్గును తగ్గించే బెస్ట్ టిప్స్…!

Share

Cold and cough: మన శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు ముందుగా మనకు వచ్చే అనారోగ్యం ఏదన్న ఉంది అంటే అది జలుబు అనే చెప్పవచ్చు. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబుతో ఇబ్బంది పడిన వారే. వాతవరణ ప్రభావం వలన చాలా మంది జలుబుతో ఇబ్బందులు పడుతుంటారు.. జలుబు వ‌ల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఊపిరి ఆడక చాలా సతమతమవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్న చాలా చిరాకుగా ఉంటుంది. అలాగే ఒక్కోసారి జలుబుతో పాటుగా ద‌గ్గు, త‌ల‌నొప్పి కూడా తీవ్ర ఇబ్బంది పెడుతుంటాం. పొడి ద‌గ్గు ప‌గటిపూట కంటే రాత్రి పూట ఎక్కువ‌గా వస్తుంది.అందుకే జలుబు తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రతి చిన్న అనారోగ్యానికి మందులు వేసుకోవడం సరైన పద్ధతి కాదు.కొన్ని కొన్ని సార్లు ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌వ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

జలుబు తగ్గించే ఇంటి చిట్కాలు :

Home remidies for Reducing cough, cold

రాత్రి ప‌డుకునే ముందు కొద్దిగా వామును నోట్లో వేసుకుని న‌మిలి కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాత్రి పూట వచ్చే పొడి ద‌గ్గు రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ దాల్చిన చెక్క‌ తప్పనిసరిగా ఉంటుంది. జలుబు తగ్గించడంలో ఇది బాగా ఉపయోగకరంగా పని చేస్తుంది.. ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడిని తీసుకోని అందులో కొద్దిగా తేనెను క‌లిపి క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం వల్ల జ‌లుబు, ద‌గ్గుల నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

అల్లంతో జలుబుకు బై చెప్పేయండి ఇలా :

Jinger juice

అలాగే బాగా జలుబు చేసినప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా అల్లం ర‌సాన్ని తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం, తేనె వేసి రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జలుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. లేదంటే టీ తాగే అలవాటు ఉన్నవారు టీలో కొద్దిగా అల్లం ముక్క వేసుకుని తాగిన మంచి ఫలితం ఉంటుంది.అంతేకాకుండా అల్లం తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.



Share

Related posts

కరోనా వైరస్ అంతం చేసే “కొంబుచా టీ” తాగాల్సిందే!

Teja

Mask: ఇదేంద‌య్యా ఇది… మాస్క్ పెట్టుకుంటే ఫైన్ క‌ట్టాల‌ట‌!

sridhar

No Addiction: ఈ సింపుల్ చిట్కా తో ధూమపానం, మద్యపానం మానేయండి..!!

bharani jella