అందం అనగానే, మనకు వెంటనే గుర్తుకువచ్చేది ఆడవాళ్ళూ…అందుకేనేమో కవులు తమకవితలతో, ఆడవారిని పోల్చకుండా ఉండలేరు.
అందమా…నే పేరేంటి అందమా అని ఒకరు , అందం అమ్మాయి అయితే అని ఇంకొకరు,రకరకాలుగా తమభావాలను కవితల రూపపంలో, పాటల రూపంలోచెప్పేస్తూ ఉంటారు.అలంకరించుకుని అందం గా కనపడటానికి ,ఆడవాళ్ళూ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.అదే ఏదైనాపార్టీ లేదాఫంక్షన్ అంటే చాలు ఆ హడావుడి గురించి ఇంక చెప్పక్కర్లేదు .ఫంక్షన్ ఒకరోజు ముందు నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవలో ముందుగానే అలోచించి వాటిని సిద్ధంగా పెట్టుకుంటాము.అయితే మనం మాములు రోజుల్లో ఎలాగా ఉన్నాసరే ఏదైనా పార్టీ లేదా ఫుక్షన్ కి వెళ్లాలంటే మాత్రం మన ముఖం లో కొద్దిగా స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటాము. పార్టీలో లేదా ఫంక్షన్ లో మనమే బాగా అందంగా కనబడాలంటే పార్టీ కి వెళ్లేముందు ఒక పావు గంట ముందు ఈవిదం గా చేస్తే మెరిసిపోతున్నమొహం, చేసుకున్న అలంకరణకు తోడవటడం తో మరింత అందం గా కనిపించ వచ్చు.ముందుగా కొద్దిగా చల్లని పచ్చిపాలు తీసుకుని దానిలో ఒక్క స్పూన్ సెనగ పిండి కలిపి ముఖానికి రాసి ఒక్క పదినిమిషాల తర్వాత కొద్దిగా చల్లని నీరు తీసుకుని ముఖం మీద రుద్దుతూ కడిగేయాలి.ఆతర్వాత టమాటో ని కట్ చేసినప్పుడు వచ్చిన రసాన్ని గింజలు రాకుండా తీసుకుని ముఖం మొత్తం రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి.టమాటో జ్యూస్ కూడా చల్లగా ఉండాలని మాత్రం మర్చిపోవద్దు.ఇలా చేస్తే ముఖం చాలా మెరుస్తుంది పైగా అలసట నీరసం అన్నిపోయి ముఖం చాలా అందంగా ఉంటుంది.