Best Oils: మగువల అందానికి ఈ ఆయిల్స్ బెస్ట్.. బెల్జియం భామల అందానికి సీక్రెట్ ఇదే..!!

Share

Best Oils: చాలా మంది యువతులు, మహిళలు సౌందర్య పోషణకు మక్కువ చూపుతారు. శరీరం, మొహం అందంగా కనిపించేందుకు వివిధ రకాల ఆయిల్స్ ను వాడుతుంటారు. ప్రపంచంలో అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్న బెల్జియం బ్యూటీల అందానికి సీక్రెట్ కేవలం నూనె ఉత్పత్తులేనంట. కేవలం కురులకు మాత్రమే కాకుండా ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి, చర్మాన్ని నిగాలింపు చేకూరడానికి, పాదాల ఆరోగ్యానికి వివిధ రకాల ఆయిల్స్ ప్రధాన సాధనంగా వినియోగిస్తున్నారు. మహిళల అందానికి ఉపయోగించే ఆయిల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Oils: for women skin
Best Oils: for women skin

మింక్ నూనె..

ప్రస్తుత కాలుష్యం వల్ల చర్మ సమస్యలతో పాటు ఇతర జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా మహిళలు ఎదుర్కొంటున్నారు. చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం, దుమ్మ వల్ల చుండ్రు రావడం, కుదుళ్లు బలహీపడి జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు మహిళలకు తీవ్ర చిరాకును తెప్పిస్తుంటాయి. మింక్ నూనెతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా చెబుతున్నారు బెల్జియం బ్యూటీలు. ఈ ఆయిల్ ను వంటికి రాయడం వల్ల మచ్చలు మటుమాయం అవుతాయి. అంతే కాకుండా స్నానం చేసే నీటిలో ఈ ఆయిల్ ను కొన్ని చుక్కలు కలుపుకుని స్నానం చేస్తే చర్మానికి లోపలి నుండి పోషణ లభించి నిర్జీవంగా మారకుండా ఉంటుంది.

టిట్రీ నూనె..

చర్మం పొడిబారడం వల్ల పొక్కులు, పింపుల్స్ వంటి సౌందర్య సమస్యలు కొందరు ఎదుర్కొంటుంటారు. పొక్కులు, పింపుల్స్ ను గిల్లడం వల్ల్ ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి మచ్చలకు సహజసిద్ధమన మందుగా టిట్రీ నూనె పని చేస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు లేక స్నానమాచరించడానికి గంట ముందు శరీరానికి టీట్రీ నూనెను పూతలా రాసుకుంటే ఆయిల్ చర్మంలోకి బాగా ఇంకి మచ్చలపై తన ప్రభావాన్ని చూపుతుంది.

Best Oils: for women skin
Best Oils: for women skin

బాదం నూనె

సాధారణంగా ఇటు ఇంటి పనులు, ఆటు ఆఫీసు పనులతో మహిళలకు క్షణం తీరిక ఉండదు. ఇది క్రమంగా నిద్రలేమికి దారి తీస్తుంది. దాని వల్ల కళ్లు ఉబ్బినట్లు అవ్వడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి సమస్య వస్తుంటాయి. వాటిని తొలగించడానికి ఖరీదైన ఆయింట్మెంట్ లను వాడితే అందగా ప్రయోజనం ఉండదు, తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. కళ్ల సమస్యలకు బాదం నూనెకు మించినది లేదంటున్నారు బెల్జియం భామలు. రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం ఆయిల్ చుక్కలు దూదిపై వేసుకుని దాంతో కళ్ల చుట్టూ రాసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనబడుతుందట.

Best Oils: for women skin
Best Oils: for women skin

ఆలివ్ ఆయిల్

చాలా మంది ముఖానికి, శరీరానికి సంబంధించి ఏన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ పాదాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. పాదాలు అందంగా ఉండేందుకు ఆలివ్ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. గొరు వెచ్చటి ఆలివ్ ఆయిల్ లో పాదాలను కాసేపు ఉంచి ఆ తరువాత ఉప్పుతో స్బ్రబ్ చేసుకుని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

తేనె

ఆరోగ్యపరంగానూ, అందం పరంగానైనా తేనె అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. తేనెను శరీరంపై పూతగా రాసుకుని ఓ అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే అందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, యాంటీ అక్సిడెంట్లు చర్మంపై ఏర్పడిన అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యల నుండి ఉపశమనం కల్గిస్తాయి.


Share

Related posts

NTR: క్రికెట్ చూడక పోవడానికి గల కారణం ఆయనే ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..!!

sekhar

జనాలను పీక్కుతింటున్న లోన్ యాప్స్ వెనుక భారీ కుట్ర..? ఛైనా నా… ఉగ్రవాదులా అన్న అనుమానం

arun kanna

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రూ.2 వేల కోట్లు ఇస్తే అంటూ సంచలన వ్యాఖ్యలు..

somaraju sharma