పిల్లల ఊబకాయానికి ఇది మంచి పరిష్కారం!!

ఈ  కాలం లో  పెద్దవాళ్ళే కాదు బాల్యం లో ఉన్న పిల్లలు కూడా  ఊబకాయం బారిన పడుతున్నారు. మారినజీవన విధానం ,   జంక్ ఫుట్స్ తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, ఈ  సమస్యకు ముఖ్యకారణాలు గా చెప్పవచ్చు. ఈ సమస్యను  ఎలా అధిగమించడం అన్న అంశం పై ఓ నిపుణు ల బృందం పరిశోధన చేసింది.

పిల్లల ఊబకాయానికి ఇది మంచి పరిష్కారం!!

ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగేలాభాల గురించి అందరికి తెలిసిందే. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టిరీయాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధమం గా జీర్ణ క్రియను మెరుగుపరిచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. శరీరం లో రోగ నిరోధక శక్తి ని పెంచి అలర్జీలు రాకుండా రక్షణ ఇస్తుంది. అయితే ఈ పొషకాలు మనకు  పచ్చడి, బటర్ మిల్క్, పెరుగు,.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాల లో ఎక్కువగా లభిస్తుంది. ఇక తాజాగా ఓ అధ్యయనం లో ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్టు రుజువైంది.

బాల్యం, కౌమార దశలో ఊబకాయంతో బాధపడుతున్నవారి బరువు తగ్గించడంలో ప్రొబయోటిక్స్ శక్తివంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాల ను యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రినాలజీ-2020లో విడుదల చేసారు. 6 నుంచి 18 సంత్సరాల మధ్య వయసు ఉండి ఊబకాయంతో బాధపడుతున్న100 మంది పై దాదాపు 8 వారాల పాటు ఈ  పరిశోధనల అధ్యయనం నిర్వహించారు. క్యాలరీస్ లేని  ఆహారం ఇవ్వడంతోపాటుగా ప్రొబయోటిక్స్ అందజేశారు. ఇలా చేయడం వలన జీవక్రియ శక్తివంతం గా మారి, బాల్యం, కౌమర దశలో ఉన్నపిల్లలు బరువు తగ్గారు.

అలాగే పిల్లలో డయాబెటిస్, గుండె పోటు వంటి ఇతర ఆరోగ్య సమస్య ల తీవ్రత ను కూడా ప్రొబయోటిక్స్ తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పైమోంటే ఓరియంటల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫ్లావియా ప్రొడామ్ మాట్లాడుతూ జీవక్రియ లో ప్రొబయోటిక్స్ పాత్రను మరింతగా అధ్యాయనం చేస్తామని పేర్కొన్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.