హెల్త్

తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఈ చిట్కాలు ట్రై చేసి చుడండి..!

Share

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం,జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వలన వాళ్ళు చూడ‌డానికి పెద్ద వారిలా క‌న‌బడతారు. అందుకే బయట మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. అయితే అవి తాత్కాలిక ఉపసమనం అయితే ఇస్తాయి కానీ. శాశ్వత పరిష్కారం ఇవ్వలేవు. అందుకే వారానికి రెండు సార్లు ఇంటి చిట్కాలను ఉప‌యోగించి తెల్ల‌జుట్టును మ‌నం న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.
ఈ చిట్కాలను ఉపయోగించడం వలన జుట్టు న‌ల్ల‌గా మార‌డంతో పాటుగా ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరుగుతుంది. మరి అదెలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..!

జుట్టు నల్లబడడానికి చిట్కా :

ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ టీ పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల బాదం నూనె,ఒక టీ స్పూన్ డెటాల్, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బాగా క‌ల‌పాలి.త‌రువాత ఈ గిన్నెను నీళ్లు ఉన్న మ‌రో గిన్నెలో ఉంచి వేడి చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డికాష‌న్ త‌యార‌వుతుంది. డికాష‌న్ త‌యార‌యిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టాలి. వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన డికాష‌న్ నీటిలో దూదిని ముంచి ఆ దూదిని జుట్టుకు, జుట్టు కుదుళ్ల‌కు రాయాలి. ఇలా రాసిన త‌రువాత 5 నిమిషాల పాటు త‌ల‌పై సున్నితంగా మ‌ర్ద‌నా చేసి 30 నుండి 40 నిమిషాల అయ్యాక తలస్నానం చేయాలి.ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా చుండ్రు స‌మ‌స్య త‌గ్గి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

కరివేపాకు -కొబ్బరి నూనె చిట్కా :

అలాగే మరొక చిట్కా ఏంటంటే ఒక గిన్నె తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, గుప్పెడు కరివేపాకులు వేసి వేడి చేయాలి.ఇది చల్లారిన తరువాత స్కాల్ప్ నుండీ జుట్టు చివర వరకూ నెమ్మదిగా ఈ నూనెను పట్టించండి. ఒక గంట తరువాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే జుట్టు పెరగడంతో పాటు నల్లబడుతుంది కూడా.

 


Share

Related posts

మీ మంత్లీ EMI ఇంతకు మించి ఉంటే అసలుకే ఎసరు అని తెలుసుకోండి !!(పార్ట్-2)

siddhu

జీవితం లో ఇలా చేయలేకపోతే చాలా మిస్సైయ్ పోతారు

Kumar

గొంతులో పేరుకున్న క‌ఫం తగ్గడానికి సూపర్ చిట్కా..!

Ram