Categories: హెల్త్

Tea: ఛాయ్ గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోరా భాయ్..!!

Share

Tea:టీ.. పేరు చెబితే చాలు ఎవరికయినా సరే ఎక్కడ లేని ఉత్సహం వచ్చేస్తుంది. తెల్లారిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు టీ తాగే వాళ్ళు ప్రపంచంలో కొట్ల సంఖ్యలో ఉన్నారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. కొందరికి అయితే అసలు టీ తాగనిదో రోజే మొదలు అవ్వదు.. అంతలా టీకు బానిసలూ అయిన వారు చాలా మందినే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. నిజానికి మన దేశం నుంచే చాలా దేశాలకు టీ ఎగుమతి అవ్వడం విశేషం అనే చెప్పాలి.సంపన్నుల దగ్గర నుండి పేదవాళ్ల వరకు టీ ను ఇష్టంగా తాగుతుంటారు. అంతలా ఆదరణ పొందిన టీ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టీ గురించి మొదట తెలుసుకున్నది ఎవరు..?

అసలు ఈ టీని మొదటిసారిగా చైనా చక్రవర్తి షెన్ నంగ్ క్రీస్తు పూర్వం 2737లో కనిపెట్టడం జరిగింది.చక్రవర్తి అయిన షెన్ నంగ్ తాగే వేడి వేడి నీటి గిన్నెలో అనుకోకుండా ఒక తేయాకు పడింది.అలా ఆ తేయాకు మరిగిన నీటిని ఆయన తాగడంతో ఆ టేస్ట్ ఆయనకు నచ్చి అలా అలా టీ గురించి ప్రపంచానికి తెలిసింది.అయితే కొన్ని శతాబ్దాల పాటు టీని ఒక ఔషధంగా వాడేవారు.ప్రస్తుత కాలం మాదిరి టీని రెగ్యులర్‌గా తాగేందుకు 3వేల సంవత్సరాల కాలం పట్టింది అనే చెప్పవచ్చు.

బాగా ఫేమస్ అయిన టీలో రకాలు ఏవంటే..?

ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాల టీలు బాగా ఫేమస్ అయ్యాయి అనే చెప్పాలి. అందులో బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్ టీలు ప్రత్యేకం అనే చెప్పాలి.ఈ టీలన్నీ తయారయ్యే మొక్క పేరు ఏంటంటే కామెల్లియా సినెన్సిస్.ఈ మొక్క యొక్క ఆకుల్ని ఏ కాలంలో కోస్తారు, ఎలా కోసి ఎండబెడతారు. ఆ తర్వాత ఏ ఏ పద్ధతులతో ప్రాసెస్ చేశారన్న దాన్ని బట్టీ ఈ నాలుగు రకాల టీలు పుట్టుకొచ్చాయన్నమాట.ఏప్రిల్ – మే నెలల్లో పెరిగిన తేయాకులతో తయారుచేసిన గ్రీన్ టీ ప్రపంచంలోచాలా మంది తాగుతారు.అలాగే ఇండియాలో టీని పాలు, అల్లం, లంవంగాలు, యాలకులు ఇలా రకరకాల సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు.

టీ గురించిన ఆసక్తికర విషయాలు :

అలాగే 1908లో టీ బ్యాగుల వాడకం మొట్ట మొదటసారిగా అమెరికాలో మొదలైంది.నిజానికి ఈ టీ బ్యాగ్స్ కేవలం ఆరు నెలల వరకే ఫ్లేవర్ ను కలిగి ఉంటాయి. ఆ తర్వాత టీ రుచి క్రమంగా తగ్గిపోతుంది.ఇకపోతే 1904 వర్జీనియాలో ఐస్ టీని కనిపెట్టారు. అలాగే కొరియా, చైనాలో క్రిసాంతెమమ్ అనే హెర్బల్ టీ బాగా వాడుకలో ఉంది.ఇక తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ అంటే చిక్కటి టీని బాగా గిలక్కొట్టి ఇస్తారు.కావున దీనిని బబుల్ టీ అంటారు.ఈ టీ నిండా అన్నీ బుడగలే ఉంటాయి. ఇక జపాన్ లో జెన్‌మైచా అనేది ఒక ప్రత్యేకమైన టీ గా చెప్పవచ్చు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

44 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

53 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago