Medicine: కవర్ ఓపెన్ చేయగానే వచ్చే ఘాటైన వాసన, నోట్లో పెట్టుకోగానే చేదుగా ఉండే ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే చాలామంది వెనుకాడుతూ ఉంటారు. ఇక పిల్లలకు ఈ టాబ్లెట్ వేయాలంటే మాత్రం తల్లిదండ్రుల తంటాలు అన్ని ఇన్ని కావు. ఇక ఇప్పుడు ఈ బాధలు లేనట్టే. పిల్లలు తమంతట తాము వచ్చి టాబ్లెట్లు కావాలని అడిగే రోజులు వచ్చేసాయి.
అందుకు కారణం ఏంటనుకుంటున్నారా ? యమ్మీ గా ఉండే గమ్మీల కాలం మొదలైంది. చిన్న చిన్న పిల్లలకు మందులు వేయడానికి తల్లులు వాటిని తేనెలో ముంచి వేయడం అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విధానం తెలిసిన ఒక శాస్త్రవేత్త మందులు ఇలా గమ్మీల రూపంలో తెచ్చే ప్రయత్నం చేశాడు. అతని పరిశోధనల ఫలితంగా ట్యాబ్లెట్ల కొత్త రూపం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. నిజానికి చిన్నపిల్లలకు సిరప్ పట్టించాలన్న , ట్యాబ్లెట్లు వేయాలన్న తల్లిదండ్రులకు అదిఒక పెద్ద సర్కస్ అవుతుంది అని చెప్పక తప్పదు. అయితే జెల్లీలు రూపంలో ఉన్న ట్యాబ్లెట్లతో ఆ సమస్య తేలికగా పరిష్కరించుకోవచ్చు.రంగురంగుల్లో ఆకర్షణీయం గా ఉన్న టాబ్లెట్ జెల్లీలు కావాలని పిల్లలే అడిగిమరీ వేసుకుంటారు. ముఖ్యంగా విటమిన్ టాబ్లెట్లు ఎక్కువ డిమాండ్ లో ఉన్నాయి. జెల్లీలా కనిపిస్తూనే విటమిన్ సప్లిమెంట్స్ అందించడమే గమ్మీలకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంతో ట్యాబ్లెట్లను ఇష్టపడని పిల్లలు,ఆడవారు గమ్మీలకు మాత్రం ఓకే చెప్పేస్తున్నారు. జిలాటిన్ ట్యాబ్లెట్లు చూడటానికి జెల్లీలా ఉంటాయి.
అంటే వివిధ రంగుల్లో చూడగానే ఎట్రాక్ట్ చేసే రూపాలలో ఉంటాయి. టేస్ట్ కి ఇది స్వీట్ గా ఉంటుంది. కొంచెం కూడా మందుల వాసన అనేది ఉండదు. జెల్లీలు తిన్నట్టుగా ఉంటాయి తప్ప ఎలాంటి తేడా కనిపించదు. ఎందుకంటే టాబ్లెట్ లో వాడే రసాయనాలు ఒక ప్రత్యేక పద్ధతిలో జిలాటిన్ మిక్స్ చేయడం వల్ల ఈ టాబ్లెట్ ఔషధ గుణాలు పోకుండా రుచిగా, ఆకర్షణీయంగా ఉంటాయి.