Diabetis: షుగర్ రోగులకు అద్భుతమైన ఆహారం గా చెప్పే  ఈ  కూరగాయ  గురించి తెలుసుకోండి !!

Share

Diabetis:  మనం వంటలకు వాడే కాప్సికమ్ ఆకుపచ్చ, ఎరుపు,పసుపు, రంగులలో లభ్యమవుతున్నాయి.దీనిని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కూరల్లో,పలావ్, బిర్యానీ,మసాలా కూరల్లోనూ ఎక్కువగా కాప్సికమ్ ని వాడతారు ఇంతకు ముందు రోజులతో  పోలిస్తే కాప్సికమ్ వాడకం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి.ఇప్పుడు కాప్సికమ్ వలన కలిగే ఆరోగ్యానికి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

 

కాప్సికమ్ లో కాల్షియం,ఐరన్, డైటరీ ఫైబర్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలతో పాటు విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, ఇ, కె సి, లు  సమృద్ధిగా ఉంటాయి.యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు కాప్సికమ్ లో అధికంగా ఉండుట వలన నొప్పులు,వాపులు తగ్గించటంలో సమర్థవంతంగా పని చేస్తుంది.ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది .
క్యాప్సికం లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడి, అవయవాల్లో ఉండే కణాల కు ఆక్సిజన్ సరిగా అందేలా చేస్తాయి.దీంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను స్ట్రాంగ్ చేయడం లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.కాప్సికమ్ లోని ప్రత్యేక గుణాలు మాడుపై రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా  చేయడం వలన జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా,దృఢంగా  ఉండి జుట్టు బాగా పెరుగుతుంది.

షుగర్ రోగులకు అద్భుతమైన ఆహారం గా కాప్సికమ్  ఉపయోగపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గేలా  చేస్తుంది. అలాగే ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే విధంగా చేస్తుంది.క్యాప్సికం లో ఉండే  విటమిన్ సి, ఫైటోకెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు పనిచేయడం తో  పాటు, దెబ్బ తిన్న మెదడు కణాల ను  రిపేర్  చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన మంచి కూరగాయల్లో  క్యాప్సికం నిలుస్తుంది. దీనిని సరైన మోతాదులో తీసుకుంటే ఎంతో  ఆరోగ్యంగా ఉండవచ్చు.


Share

Related posts

సెల్ టవర్లను టార్గెట్ చేసుకున్న రైతు ఆందోళనకారులు!పంజాబ్ లో ఫటాఫట్!!

Yandamuri

కోన వెంకట్ ఆ హీరోయిన్ పై ప్రత్యేక అభిమానంతో అనుష్కనే పక్కకు నెట్టేశారు

sowmya

బిగ్ బాస్ 4 : హౌస్ లోకి పవన్ కల్యాణ్ వీరాభిమాని రాబోతున్నాడు .. ఇక అరాచకమే ..!

GRK