Betel leaves : తమలపాకు పూజకు, శుభకార్యాలకు, కిళ్ళీ లకు మాత్రమే వాడుతుంటాము. అందువల్ల వాటికి చాల డిమాండ్ ఉంటుంది. తమలపాకు తో పేస్ ప్యాక్ లు కూడా వేసుకోవచ్చట ఆ విషయాలు గురించి తెలుసుకుందాం. తమలపాకులతో చర్మం మెరిసేలా చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు.కాస్మొటిక్ , బ్యూటీ, ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు ఆరహస్యం తెలుసు.
తమలపాకు లో పుష్కలం గా ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మం పై ఉండే మృత కణాలను తొలగించి చర్మాన్ని స్వచం గా ఉంచుతుంది. ఆ వెంటనే కొత్త కణాలు పుట్టి చర్మం మెరుస్తూఉంటుంది . ఇందుకోసం చేయవలిసింది ఏమిటంటే ఓ టీ స్పూన్ తెనె నుతీసుకుని తమలపాకులకు రాసి, దానిని ముఖానికి నెమ్మదిగా రుద్దుకుని ఓ పావు గంట అలా ఉండండి. తర్వాత వాటిని కొద్దిగా వేడి వున్న నీటి తో శుభ్రం చేసుకోండి. అలా కాదు అంటే తమలపాకులను జ్యూస్‌లా చేసి,ఆ రసంలో తేనె కలిపి పేస్టులా చేసుకుని కూడా రాసుకోవచ్చు.
ఎలా చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది.ఇలా వారానికి 2సార్లు చొప్పున చేస్తుండాలి. ఇలా చేస్తూ ఉండడం వలన కాంతివంతమైనచర్మం మీ సొంతమవుతుంది . పైగా చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది .తమలపాకు లను నీటి లో ఉడికించి, ఆ నీరు చల్లారిన తర్వాత ముఖాన్ని కడుక్కున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తే… ముఖం అంతలా మెరుస్తుంటుంది. అంతేకాదు… ఈ ఆకులు, ముఖం పై కాలిన గాయాలను సైతం నయం చేస్తాయి.
కొన్ని తమలపాకులను మిక్సీ లో వేసి పేస్ట్ గా చేసుకుని దానికి తేనె, చార్కోల్ కలిపి, కాలిన గాయాల పై రాసుకుంటే, చాల త్వరగా గాయాలు తగ్గిపోతాయి. ముఖంపై మచ్చలు, మొటిమల ఉన్న కూడా ఇవి బాగా పనిచేస్తాయి. తమలపాకు రసాన్ని వేడి చేసి, చల్లారిన తర్వాత తేనె కలిపి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. తేనె కలపకుండా కూడా రాసుకోవచ్చుకాకపోతే తేనె కలిపితే కాస్త పేస్టుల తయారయి కారిపోయి కిందకు వచేయకుండా కాసేపు అలాగే పట్టి ఉంటుంది. పావుగంట తర్వాత నీటి తో కడిగేసుకుంటే చాలు