NewsOrbit
న్యూస్ హెల్త్

Biotin: జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే బయోటిన్ తప్పనిసరి.!?

Biotin: వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాలలో లోపం, హెయిర్ ప్రొడక్ట్స్ లోని రసాయనాలు, ఇలా ఇతర కారణాలతో జుట్టు రాలిపోతుంది.. దీంతో చాలామంది బయోటిన్ ను తీసుకుంటున్నారు.. ఇంతకీ బయోటిన్ జుట్టుకి అవసరమా.!? బయోటిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందా.!? వంటి విశేషాలు తెలుసుకుందాం.!?

Biotin-Rich Foods For Natural Hair Growth and Strengthening of Hair
Biotin Rich Foods For Natural Hair Growth and Strengthening of Hair

విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి7 ను బయోటిన్ గా పిలుస్తారు.. దీన్ని వైద్యులు జుట్టు రాలకుండా ఉండడానికి వాడమని సూచిస్తున్నారు. అయితే బయోటిన్ ను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే జుట్టుకు కావలసిన బయోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. బయోటిన్ సమృద్దిగా లభించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లివర్: లివర్ లో బయోటిన్ సమృద్దిగా ఉంటుంది. దీనిని వారంలో రెండు సార్లు తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

గుడ్డు: గుడ్డు పచ్చసొనలో బయోటిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన రోజుకో గుడ్డును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టుకు కావలసిన బయోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

అవకాడో: బయోటిన్ సమృద్ధిగా లభించే పదార్థాలలో ఆవకాడో కూడా ఒకటి. అవకాడను మీ డైట్ లో భాగంగా ఆరోగ్యానికి కావలసిన బయోటిన్ లభిస్తుంది. బయోటిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.

తృణధాన్యాలు: తృణధాన్యాలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్ బి7 సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడి జుట్టు రాలకుండా ఉంటుంది.

సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్ మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. ఈ సాల్మన్ ఫిష్ తీసుకోవడం వలన ఇందులో ఉండే బయోటిన్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

చిలగడదుంప: చిలగడదుంప జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. అరకప్పు ఉడికించిన చిలగడ దుంపలో 2.4 మైక్రో గ్రాముల బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది.

 

బాదం: బాదం లను తీసుకుంటే జుట్టు పెరుగుదలకు కావలసిన బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. వాల్ నట్స్, పల్లీలు, బాదంలను కలిపి రోజుకు తీసుకుంటే చాలు. ఇవి జుట్టు సమస్యలను దూరం చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.

 

పుట్టగొడుగులు: పుట్టగొడుగులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావలసిన ప్రోటీన్ లను అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలకుండా ఉంటుంది.

 

అరటిపండు: అరటిపండులో బయోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పీచు, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 

ఆకుకూరలు: ఆకుకూరలను తీసుకుంటే కురులు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పాలకూరను ఎక్కువగా తీసుకుంటే శరీరానికి జుట్టు పెరగడానికి సహాయపడి జుట్టు రాలిపోకుండా చేస్తుంది.

పాలు: పాలలో ప్రోటీన్లు ఎక్కువగా వుంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన శక్తిని అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గి జుట్టు రాలకుండా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే మంచిది.

క్యాలీఫ్లవర్, ఈస్ట్, హోల్ గ్రైన్ బ్రెడ్, రాసో బెర్రీస్ కూడా బయోటిన్ సమృద్దిగా లభిస్తుంది వీటిని మీ డైట్ లో భాగం చేసుకుంటే జుట్టు రాలడాన్ని, తగ్గించి జుట్టు కుదుళ్లకు పోషణను అందించి జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju