Biryani leaf: ఒక్క బిర్యానీ ఆకు వల్ల ఒక మనిషికి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. తప్పకుండా డైలీ ఈ పని చేయండి..

Share

Biryani leaf: బిర్యానీలో ఉపయోగించే ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట, ఇవి అనేక ఆనారోగ్య సమస్యలకు దివ్య ఔషదంగా పని చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. బిర్యానీ ఆకును అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారు చేసుకోవచ్చట. బిర్యానీ ఆకుకు సంబంధించి అన్ని లక్షణాలు ఈ టీ గ్రహిస్తుంది. బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి సువాసన కల్గి ఉంటుంది.

బిర్యానీ ఆకులతో టీ ఇలా తయారు చేసుకోవాలి

రెండు మూడు కప్పుల నీరు ఓ కుండలో పోసి మరిగించాలి. తరువాత బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరిగిన నీటిలో వేయాలి. ఆ తరువాత నీటిని ఫిల్టర్ చేసి ఒక కప్పులో వేసి వేడివేడిగా తాగండి.

Biryani leaf: దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే…?

బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ గుండె ను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఇందులో రూటిన్, కెఫిక్ ఆమ్లం ఉంటాయి. వీటితో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహయపడుతుంది. స్ట్రోక్ ప్రమాదానిన తగ్గిస్తుందట. అదే విధంగా బిర్యానీ ఆకులు యాంటీ ఇన్ప్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బెణకులు, కీళ్ల నొప్పి, ఆర్ధరైటిస్ తో సహా ఎలాంటి నొప్పినానా తగ్గించడంలో సహాయపడుతుంది. నూతన అధ్యయనాల ప్రకారం బిర్యానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలు కల్గి ఉంటాయి. ఇవి ఫైటోన్యూట్రియెంట్స్ కలిగి ఉంటాయి. ముత్ర పిండాల్లో రాళ్లు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యల పరిష్కారానికి కూడా బిర్యానీ ఆకులు దోహదపడతాయి. అదే విధంగా బిర్యానీ ఆకులు జలుబు, దగ్గు తదితర శ్వాసకోశ సమస్యలను తొలగిస్తుంది. బిర్యానీ ఆకు టీ క్రమంతప్పకుండా తీసుకుంటే టైపు 2 డయాబెటిస్ తో ను నియంత్రిస్తుంది.

 

 


Share

Related posts

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?

sridhar

రక్త హీనతతో బాధ పడుతున్నారా? ఇది మీకోసమే!!

Kumar