Cancer: క్యారట్ అంటే అందరికీ ఇష్టమే.. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.. ప్రతినిత్యం వీటిని తింటే ఆరోగ్య సమస్యలు దరి చేరనివ్వదు.. క్యారెట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ క్యారెట్ కూడా ఒకటి.. ఈ క్యారెట్లు తింటే మన ఆరోగ్యానికి కలిగే బోనస్ ఏమిటంటే..!?

బ్లాక్ క్యారెట్ ప్రత్యేకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. ఈ క్యారెట్ లో మనకు తెలియని తీపి గమనించవచ్చు. బ్లాక్ క్యారెట్ విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను దాడి చేసే శక్తివంతమైన గుణాలను కలిగి ఉంది. ఇంకా జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకా తెల్ల రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.
Read More: Second Heart: మన శరీరం లో గుండె కంటే ముఖ్యమైన భాగం ఒకటి ఉంది .. ఇది తేడా వస్తే స్పాట్ డెత్ !

బ్లాక్ క్యారెట్లో ఆందోసైనిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కార్యకలాపాలను తటస్థం చేయడంలో బ్లాక్ క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది. అందువలన క్యాన్సర్ మీ దరి చేరకుండా ఉండాలంటే బ్లాక్ క్యారెట్ ను మీ డైట్లో భాగం చేసుకోవాలిసిందే..