Black Coffee With Ghee Benefits: అసలు మన వాళ్ళు బ్లాక్ కాఫీ అంటేనే అబ్బ చెడ్డ చేదు అస్సలు వొద్దు బాబోయ్ అంటారు. అలాంటిది బ్లాక్ కాఫీ లో నెయ్యి కలుపుకుని తాగడం అంటే ఆమడ దూరం పరిగెడతారు. కానీ నెయ్యి కలుపుకొని బ్లాక్ కాఫీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా ఘీ కాఫీ ఐస్ మై ఫేవరెట్ అని రోజు తాగడం మొదలు పెడతారు.
నెయ్యి తో బ్లాక్ కాఫీ చేదు మాయం
అవును నెయ్యి పాల పదార్ధాలలో అత్యంత సువాసన మరియు రుచి కలిగి ఉంటుంది. అందుకే వేడి వేడి అన్నం లో నెయ్యి కలుపుకొని మనం గట్టిగా లాగిస్తాము. అయితే ఇదే నెయ్యిని బ్లాక్ కాఫీ లో కలుపుకుని తాగితే కాఫీ లో ఉండే చేదు తగ్గుతుంది. అంతే కాదు నెయ్యికి ఉండే సహజ గుణం వలన బ్లాక్ కాఫీ లో ఉండే ఆమ్లత్వం అంటే ఎసిడిటీ తగ్గించేస్తుది. చాలా మంది బ్లాక్ కాఫీ ని ఇష్టపడక పోవడానికి కారణం ఈ ఎసిడిటీ కానీ నెయ్యి తో ఇప్పుడు ఆ సమస్య పోయినట్టే.
Black Coffee With Ghee Benefits: అద్భుతమైన పోషకాల నిధి నెయ్యి కాఫీ
మనకు ఒక రోజులో కావాల్సిన విటమిన్ A, విటమిన్ E, విటమిన్ K, కాల్షియమ్, జింక్, మెగ్నీషియం లాంటి ఎన్నో పోషకాలు నెయ్యి లో ఉన్నాయి. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ లో చెమ్చాడు నెయ్యి వేసుకుని తాగితే ఆ రోజుకు అవసరమైన ఈ పోషకాలు అన్ని మనకి దొరుకుతాయి. నెయ్యి లో ఉండే కొవ్వు పదార్ధాల ఈ పోషకాలను త్వరగా మన శరీరం గ్రహించుకునేట్లు చేస్తాయి.
మానవ శరీరం ఒక వయసు దాటిన తరువాత పాలను పూర్తిగా అరిగించుకునే శక్తిని కోల్పోతుంది. అంతే కాదు చాలా మంది పెద్దవాళ్లకు పాలు పడవు దీన్నే ఇంగ్లీష్ లో లాక్టోస్ ఇంటోలరెన్స్ అని అంటారు. అయితే నెయ్యి తో ఈ సమస్య ఉండదు. పాలు లేదా క్రీమ్ లాంటి డైరీ వాడకుండా నెయ్యి వేసుకుని కాఫీ తాగితే ఎంచక్కా వీరంతా ఉదయాన్నే ఎలాంటి పొట్టకు సంబందించిన సమస్యలు లేకుండ కాఫీ తాగొచ్చు.

నెయ్యి కి శోథ నిరోధక శక్తి …పొట్ట ప్రేగు ఆరోగ్యానికి అద్భుత ఔషధం
చాలా మంది కాఫీ తాగాలి అని అనుకుంటారు కానీ ఆ తరువాత వొచ్చే అసిడిటీ పొట్ట నొప్పి లాంటి సమస్యల వలన వీరు కాఫీ ని అవాయిడ్ చేస్తారు. మనం కాఫీ లో నెయ్యి కలుపుకున్నట్లు అయితే కాఫీ లో ఉండే అసిడిటీ తగ్గిపోతుంది. నెయ్యి కి శోథ నిరోధక శక్తి ఉంటుంది దీన్ని ఆంగ్లములో యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అంటారు. నెయ్యి లో ఉండే బుటీరేట్ అనే పదార్ధం వల్ల మన పొట్ట ప్రేగు ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.

Black Coffee With Ghee Benefits: గుండె ఆరోగ్యానికి సాటిలేని ఔషధం నెయ్యి
జీవక్రియ లేదా ఇంగ్లీష్ లో మెటబాలిజం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఎప్పుడైతే ఈ జీవక్రియ శృతి తప్పుతుందో అప్పుడు మనకి చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా గుండెకు సంబందించిన సమస్యలు తలెత్తుతాయి. నెయ్యి లో ఉండే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 లాంటివి మన జీవక్రియను అదుపు లో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోజూ కాఫీ లో నెయ్యిని కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఇలాంటి ప్రయోజనాలతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అంటే కాఫీ లో నెయ్యి మన గుండె ఆరోగ్యానికి మందు లాంటిది అన్నమాట.

ఘీ కాఫీ తో సులభంగా బరువు తగ్గుతారు
మనకు ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా? శరీరానికి ఇంధనం అవసరం అయినప్పుడు లెప్టిన్ (leptin) అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ లెప్టిన్ హార్మోన్ మన బ్రైన్ కి ఆకలి సిగ్నల్స్ ఇస్తుంది. కానీ నెయ్యి లో ఉండే ప్రత్యేక గుణం వలన మన లెప్టిన్ హార్మోన్ విడుదల తగ్గుతుంది. దీని వలన మనకు ఆకలి తగ్గిపోతుంది. పొట్టలో నీయి అరగడానికి చాలా సమయం పడుతుంది. కాఫీ కి కూడా ఇలాంటి గుణం ఉంది ఈ రెండు కలిపి తాగితే అంతే ఇంకా ఆకలికి గుడ్ బాయ్ చెప్పొచ్చు. తక్కువ ఆకలి మంచి జీవక్రియ(metabolism) వలన మీరు చాలా త్వరగా బరువు తగ్గవోచ్చు. దీనికి జతగా కొంచెం వ్యాయామం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

కాఫీ లో నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం(constipation) తగ్గుతుందా?
చాలా మంది పెద్దవారు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకునే సమయం లో మలబద్ధకం తో బాధపడతారు. మలబద్ధకం(consitpation) తో మీ రోజు మొదలయింది అంటే ఆ రోజంతా మీకు ఇబ్బంది గా ఉంది ఏ పని సరిగ్గా చేయలేరు. మీరు బ్లాక్ కాఫీ లో నెయ్యి కలుపుకుని తాగితే ఆ రెండు కలిసి పొట్టకు ఉద్దీపన(stimulant) లా పనిచేస్తాయి. ఇది చాలామందికి మలబద్ధకానికి విరుగుడులా పనిచేస్తుంది. అయితే కేవలం ఘీ కాఫీ కాకుండా మీరు తినే పదార్ధాలలో పీచు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే మంచిది.

నెయ్యి కలిపిన కాఫీతో శక్తివంతమైన ఉదయం
ఉదయాన్నే వ్యాయామంకి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కానీ చాలా మందికి పొద్దున్నే లేచి రన్నింగ్ లాంటి వ్యాయామం చేయాలి అంటే బద్ధకంగా అనిపిస్తుంది. అదే మీరు నెయ్యి కలిపిన బ్లాక్ కాఫీ తాగితే ఇట్టే లేచి రోజు క్రమం తప్పకుండ వ్యాయామం చేస్తారు. నెయ్యి లో మనకు వ్యాయామం చేయడానికి కావాల్సిన శక్తి ఉంటుంది కాఫీ లో బద్ధకాన్ని తొలగించి మూడ్ మంచిగా చేసే గుణం ఉంటుంది. ఈ రెండు కలిపి తాగితే ఇక మీ ఉదయాలన్ని శక్తివంతమై చక్కటి ఆరోగ్యానికి దారి తీస్తుంది.
ఈ ఆర్టికల్ లో చర్చించబడిన అంశాలు: నెయ్యి కలిపిన బ్లాక్ కాఫీ ప్రయోజనాలు(black coffee with ghee benefits), నెయ్యి కలిపినా బ్లాక్ కాఫీ తో బరువు తగ్గడం(does coffee with ghee reduce weight), బ్లాక్ కాఫీ లో నెయ్యి తో ఆరోగ్య ప్రయోజనాలు(health benefits of black coffee with ghee)