Body Pains: అన్ని రకాల శరీర నొప్పులను తగ్గించే తైలం..!!

Share

Body Pains: ఈ రోజుల్లో ఎక్కువ మంది కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు..!! ఈ నొప్పులను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే వివిధ రకాల పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగిస్తున్నారు.. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..!! ఇప్పుడు మనం చెప్పుకోబోయే తైలం తయారు చేసుకుని వాడుకుంటే అన్ని రకాల శారీరక నొప్పులను తగ్గిస్తుంది..!! ఆ తైలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!

Body Pains: relif best oil
Body Pains: relif best oil

ఈ తైలం తయారు చేసుకోవడానికి అర లీటర్ ఆవనూనె, 5 ఉమ్మెత్త కాయలు అవసరం. ముందుగా ఉమ్మెత్త కాయలను సేకరించి శుభ్రంగా కడిగి చివరన ఉన్న కొనలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆవనూనె పోయాలి. ఇందులో ఉమ్మెత్త కాయలను వేసి బాగా మరిగించాలి. నూనె బాగా మరిగిన తరువాత దించి ఆ నూనె ను వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

Body Pains: relif best oil
Body Pains: relif best oil

ఇప్పుడు మనం తయారుచేసుకున్న తైలమును కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పి ఉన్న చోట రాసుకోవాలి. రాశాకా ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తరువాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని కట్టు కట్టాలి. ఇలా రెండు రోజుల పాటు రాస్తే నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఈ తైలం ను మీ శరీరంలో ఎక్కడైతే నొప్పిగా ఉంటుంది. అక్కడ రాసి మర్దనా చేసి కట్టుకడితే తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే ఇంట్లోనే సహజసిద్ధమైన ఈ తైలం తయారు చేసుకుని వాడండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.


Share

Related posts

Revanth reddy: రేవంత్ రెడ్డి ని ఘోరంగా అవ‌మానించిన కేసీఆర్ స‌ర్కారు

sridhar

Pushpa : పుష్ప మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన అనసూయ, ఫాహద్ ఫాజిల్

GRK

రవిప్రకాష్‌పై కేసు..ఉద్వాసన!

Siva Prasad