Bottle gourd: సొరకాయ పేరు చెబితే చాలు చాలు చాలా మంది ఆమ్మో సొరకాయ అని పెదవి విరుస్తారు… అసలు ఆరోజు తినడం అయినా మానేస్తారు కానీ సొరకాయ కూరతో అన్నం మాత్రం తినరు. నిజానికి సొరకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.సొరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది కావున ఇది శరీరాన్ని డీహైడ్రెషన్ నుంచి రక్షిస్తుంది.అంతేకాకుండా వేసవి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇవే కాకుండా సోరోకాయ తినడం వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సొరకాయ తింటే బరువు తగ్గుతారా..?
ఈ కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సొరకాయ ఒక వరం అనే చెప్పాలి.ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా సొరకాయ వండుకొని తింటే బరువు తగ్గుతారు అని నిపుణులు చెబుతున్నారు.ఈ గ్రీన్ వెజిటేబుల్ మనం శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.ఫలితంగా బరువు తగ్గుతారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జీర్ణ సంబంధిత సమస్యలు మటుమాయం :
అలాగే సొరకాయలో నీటి శాతంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.అంతేకాకుండా జీర్ణ సంబందింత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.జీర్ణవ్యవస్థ కూడా మరింత బలపడుతుంది.సొరకాయలో పీచు పదార్థం ప్రధానంగా ఉండడం వలన అజీర్ణం వంటి సమస్యలు రావు.మలబద్ధకం, మొలలు వంటి అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
షుగర్, బీపీ కంట్రోల్ :
సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బి.పి, మదుమేహ వ్యాధిగ్రస్తులకు సొరకాయ మంచి ఆహారం అనే చెప్పాలి. రక్తంలో చక్కెర స్థాయిల ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది. డయాబెటిస్ గలవారి విషయంలో హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.క్రమం తప్పకుండా సొరకాయ రసం త్రాగడం వలన మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
అందం రెట్టింపు :
సొరకాయ తింటే అందులే ఉండే నీరు మీ శరీరాన్ని పొడిబారకుండా, నిగనిగ మంటూ మెరిసేలా చేస్తుంది.అనేక రకాల చర్మ సంబంధమైన రుగ్మతల నుంచి సొరకాయ కాపాడుతుంది. శరీరంపై వచ్చే మచ్చలను తొలగించడానికి కూడా సొరకాయ దోహదపడుతుంది.