ఈ ఆధునిక కాలంలో టెక్నిలోజి పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువవుతోంది. వారికి కావలసిన పదార్థాలు తాజాగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరి అనుకుంటారు. దానిలో వారికి కావలసిన పదార్థాలు నింపేసి పెడతారు. దింతో ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతిసారి ఏదో ఒక రకమైన చెడు వాసన వస్తుంటుంది. ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం పరచడం అంటే కష్టమైన పని కానీ అందుకు ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే చెడు వాసనలు లేకుండా మీ ఫ్రిడ్జ్ ని ఉపయోగించుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం
ముందుగా మీ ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఉండాలంటే చాలా రోజులుగా నిల్వ ఉన్న పదార్థాలు నిల్వఉంచొద్దు. ఒకే వస్తువును ఫ్రిడ్జిలో చాలా రోజులు ఉంచిన కూడా అది చెడిపోతది. దాని వల్ల ఇతర పదార్థాలు కూడా చెడిపోయి వాసన వచ్చే అవకాశం ఉంటది. అందుకే మనం రెగ్యులర్ గా వాడే పదార్థాలను మాత్రమే ఫ్రిడ్జిలో పెట్టాలి. ముఖ్యంగా పాలకు సంబందించిన ఉత్పత్తులను ఫ్రిడ్జిలో ఒలకకుండా చూడాలి. ఒక ఒలికితే వెంటనే తుడిచేయాలి లేదంటే చేడు వాసనను వెదజల్లడమే లేకుడా లోపల ఉన్న వేరే పదార్థాల మీద కూడా ఈ ఎఫెక్ట్ చూపిస్తది. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను, పాలను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి. ఫ్రిడ్జిలో ఆకుకూరలు పెడుతున్నప్పుడు కడిగి పూర్తిగా ఆరిపోయాక పెట్టాలి, తడితడిగా ఉన్నపుడు పెడితే త్వరగా కుళ్లిపోతాయి.
ఫ్రిడ్జిలో మనం పదార్థాలు పెడుతున్నామంటే వాటిపై తప్పని సరిగా మూతలు ఉండేలా చూసుకోవాలి లేదంటే అవి చెడిపోవడమే కాకుండా వాటి వాసనను ఫ్రిడ్జ్ మొత్తం వెదజల్లుతాయి. ఫ్రిడ్జిలో ముఖ్యంగా మసాలలతో చేసిన వస్తువులను అస్సలు పెట్టడకూడదు ఒకవేళ పెట్టిన వాటిని గట్టి మూతతో బిగించగల డబ్బాలలో భద్రపరచాలి లేదంటే అవి త్వరగా చెడిపోయి చెడువాసనను పెంచుతాయి. ఫ్రిడ్జ్ నిండుగా పెట్టిన వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడాను తీసుకొని రంద్రాలున్న ఒక డబ్బాలో ఫ్రిడ్జిలో ఒక మూలాన పెట్టాలి దీనివల్ల సువాసన రావడమే కాకుండ, ఫ్రిడ్జ్ లోని వస్తువులు తాజాగా ఉంచుతుంది. నిమ్మకాయలు కోసి ఆ ములను ఒక మూలన పెట్టిన ఫ్రిడ్జ్ వాసన రాదు. అంతేకాదు క్రమం తప్పకుండ రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేయాలి.