Baby: 7 – 9 నెలలు:
ఈ పిల్లలు తమ చుట్టుపక్కలున్న పరిసరాలు , మనుషుల్ని గుర్తుపడుతుంటారు. వారి పేరుతొ పిలిస్తే తిరిగి చూస్తుంటారు. ఈ సమయం లో అద్దం ముందు కుర్చో పెడితే చాలా సందడి చేసేస్తూ ఉంటారు.వారి సందడికి పెద్దలు నవ్వకుండా ఉండలేరు.
పాటలు ,పద్యాలూ వంటివి వినిపించడానికి ఇది మంచి సమయం గా చెప్పబడింది. వాటి అర్ధం తెలియక పోయినా, పాడడానికి నోరు తిరగకపోయిన కూడా వారు వింటున్న వాటిని ఆస్వాదిస్తూవుంటారు .ఈ సమయం లో నిల్చోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళని నిల్చోపెట్టండి. సోఫా, మంచం సపోర్ట్ తో నిల్చోపెట్టి, డాన్స్ చేస్తూ, వారితో చెయ్యించండి.
Baby: 10 – 12 నెలలు:
పిల్లల్ని అడించడానికి బిల్డింగ్ బ్లాక్స్ ఒక మంచి మార్గం అనే చెప్పవచ్చు. మొదట మీరు వాటిని పెడుతున్నప్పుడు వారు దాన్ని నిలువునా కూల్చేయటం వంటివి చేస్తుంటారు. కానీ మీరు చేస్తుండగా వారు చూసి నేర్చుకోవడానికి ఉత్సహం గా ఉంటారు.త్వరలోనే మీరు కట్టిన విధంగా కట్టేయటానికి ప్రయత్నిస్తారు. పిల్లలతో పాటుగా మీరు కూడా వారి వెంట పాకుతూ, వారిని వెంబడిస్తున్నటు చేస్తే , అది చూసి వారు మరింత త్వరగా పాకడానికి చూస్తుంటారు. కానీ ఇటువంటివి చేసే టప్పుడు అడ్డుగా ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి.
పిల్లలు పాకుతున్నప్పుడు, వారికి ఇష్టమైన బొమ్మ లేదా బంతి ని వారి ముందుకి వేసి అందీఅందనట్టు చేస్తే దాన్ని అందుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం, ఆ పట్టుదల చుస్తే ముచ్చటేస్తుంది.
పిల్లలతో మాట్లాడాలి
పిల్లల్ని ఒళ్ళో కూర్చో పెట్టుకుని మనం మంచం లేదా కుర్చీ ,సోఫా మీదనో కూర్చుని,ఒడిలోనుండి మెల్లగా, సున్నితంగా మోకాళ్ళ మీదగా కిందకు జారుస్తు జారుడుబండ ఆడిపించవచ్చు.ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడాలి, ఆడాలి పడాలి… వారి తో పాటు నడుస్తూ, పాకుతూ ఉంటే మీ మధ్య బందం బలపడటం తో పాటు పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆటలు, వారి అభిరుచి వీలుని బట్టి తల్లిదండ్రులు వారితో ఏ ఆట ఆడిన వారికి సంతోషమే.