Categories: హెల్త్

Migraine: పిల్లలలో మైగ్రేన్ రావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడండి!!

Share

Migraine: మైగ్రేన్ అనేది కేవలం పెద్దవాళ్లకే కాదు చిన్న పిల్లలకు వస్తుంది.  చిన్నపిల్లల్లో మైగ్రేన్ ( Migrane ) వచ్చేందుకు  కారణాలు ఉన్నాయి.  వంశానుగతం గా  కొందరికి మైగ్రేన్ వస్తే, మరి కొందరికి  వాతావరణంలో  వచ్చే  మార్పుల వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది.  వీటితో పాటు  పిల్లలు సరిపడినంత  నిద్రపోకపోయిన,అదే విధం గా    నిద్ర  సమయాల లో మార్పు వచ్చిన ,ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.నిద్ర అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి చాలా అవసరం. చిన్నపిల్లలు రోజుకు కనీసం 10 గంటల పాటు   నిద్రపోవాల్సిఉంటుంది.  అలా నిద్ర పోతేనే వాళ్ల మెదడు బాగా  అభివృద్ధి  చెందడానికి అవకాశం ఉంటుంది. అదే విధానం లో పిల్లలకు   నిద్రకు సంబంధించి  సమస్యలు ఉన్నాయి అంటే  అది ఖచ్చితంగా మైగ్రేన్ కు  కారణమవుతుంది.

మరి పిల్లలకు సరిపడినంత  నిద్ర ఉండాలంటే.. సెల్ ఫోన్స్ కి , టీవీ చూడడానికి , మ్యూజిక్ ప్లేయర్స్   లాంటి వాటికి దూరంగా ఉంచి ,  సరిపడా నిద్ర పోయేలా చేస్తే మాత్రం  భవిష్యత్తులో మైగ్రేన్ సమస్య  ఉండదు.  సరి పడా నిద్ర పోయేలా చూస్తే , మైగ్రేన్ తో  ఉన్న  పిల్లలు కూడా   ఆ సమస్య నుంచి బయట పడతారు.పిల్లలు   ఎక్కువ ఒత్తిడికి  గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.   వీలైనంత ప్రశాంతంగా పిల్లలు ఉండేలా జాగ్రత్త పడాలి. వాళ్ల మీద చదువు ఒత్తిడి కూడా  పెంచకుండా ఉండడం మంచిది. వాతావరణంలోవచ్చే  మార్పుల వల్ల కూడా పిల్లలకు మైగ్రేన్ వచ్చే అవకాశం  ఉంది. అతి వేడి లేదా  తేమ, డీ హైడ్రేషన్  వంటి వాటి వల్ల  కూడా పిల్లల్లో మైగ్రేన్  సమస్య వస్తుంది.ఏదైనా కారణం తో  వాతావరణంలో అటువంటి మార్పులు  వస్తే    పిల్లలను ఆ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధం గా జాగ్రత్తలు తీసుకోవాలి.   ఆహారం లో జాగ్రత్త అనేది చాలా అవసరం. పిల్లలకు    పౌష్ఠికాహారం ఎక్కువగా ఇవ్వాలి.   జంక్ ఫుడ్ వైపు అస్సలు వెళ్లనివ్వకూడదు.

పోషకాలు బాగా ఉన్న  ఆహారం , పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉన్న ఆహార  పదార్థాలను   ప్రతి రోజు ఆహారంలో భాగం  చేయడం వలన వాళ్లకు ఎటువంటి మైగ్రేన్ సమస్యలు రావు. ఒకవేళ ఇప్పటికే ఉన్నా  ఇలాంటి ఆహారపు అలవాట్లు  చేస్తే చాలా త్వరగా  మైగ్రేన్ సమస్య నుంచి పిల్లలు బయట పడతారు.   పిల్లలకు   ఎక్కువగా ట్యాబ్లెట్లు  వేయడం వంటివి   చేసిన  కూడా మైగ్రేన్ కు  కారణం అవుతుంది.   ఏదైనా సమస్యకు డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా కూడా   తక్కువ మెడిసిన్స్  వేస్తూ..   ఇంటి చిట్కాలను పాటించి పిల్లల జబ్బులను  తగ్గించేలా చూడాలి. ఉదాహరణకు.. పిల్లలకు జలుబు చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి  వెళ్లి ట్యాబ్లెట్లు తీసుకొచ్చి పిల్లలకు  వేసేయకండి.  జలుబు అనేది పిల్లలకు చాలా సహజం . దాన్ని ఇంటి చిట్కాలతో  తగ్గించ వచ్చు.ఎంతో అవసరం అయితే తప్ప   మెడిసిన్  వాడకుండా ఉండటం వలన  పిల్లల్లో మైగ్రేన్ సమస్యను  చాలా వరకు తగ్గించవచ్చు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

33 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago