పూలు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. అందులోనూ చామంతి పూలు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. తల్లో పెట్టుకోవడానికి అయినా డెకరేషన్ చేయడానికి అయినా చామంతి పూలు భలే అందంగా కనిపిస్తాయి. అయితే ఈ చేమంతిపూలను కేవలం శిరోజాలంకరణకే కాకుండా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మరి చామంతి పూల యొక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
చామంతి పూల ఉపయోగాలు :
చేమంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి, ఒంటిపై దురదలున్న చోట రాస్తే దురదలు వెంటనే తగ్గిపోతాయి. అలాగే ఎవరికయినా నోటిపూత వుంటే వాళ్లకు చామంతి పూల పేస్ట్ ను నోట్లో లోపల రాస్తే నోట్లో పూత తగ్గుతుంది.అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు చేమంతి ఆకులను నేతితో వెచ్చచేసి, నుదుటిపై, కణతల మీద వేసి కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయి.చేమంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం, సాయంత్రం ఒక చిన్న గ్లాసు తాగితే మోషన్ ఫ్రీగా అవుతుంది.
చామంతి టీ :
అలాగే చేమంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలు కడిగితే వెంటనే మాయమౌతాయి.ఒక్కోసారి విషపూరితమైన తేలు, జెర్రి మొదలైన క్రిములు కుట్టినప్పుడు అవి కుట్టిన చోట చామంతి పువ్వుల పేస్ట్ రాసి ఆ గుడ్డపొగ వేస్తే విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుంది.అలాగే చామంతి టీ తగితే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులకు చామంతి టీ చాలా మంచిది. ఈ టీ తాగడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు