ట్రెండింగ్ హెల్త్

Chamomile Oil: ఈ నూనె ఒక్కసారి రాస్తే ఎంతకాలం కీళ్ల నొప్పైనా మటుమాయం..!

Share

Chamomile Oil: నేటి ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా.. మూడు పదుల వయసులో కూడా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.. శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం, ఎక్కువసేపు కూర్చోవడం ఇలా రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తున్నాయి.. కీళ్ల నొప్పుల వస్తే ఓ పట్టాన తగ్గవు.. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు కీళ్లనొప్పులు ఉన్నాయా.. ఈ నూనె రాసి మర్దనా చేస్తే నొప్పులన్నీ ఫటాఫట్..!

Chamomile Oil: To check knee Pain
Chamomile Oil: To check knee Pain

చామంతి పూలను దైవారాధనకు తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. చిట్టి చామంతుల నుంచి నూనెను తయారు చేస్తారు. ఈ నూనె ను క్యామోమిల్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ నూనె అన్ని రకాల షాప్స్ లో దొరుకుతుంది. కాకపోతే ఈ ఆయిల్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. చిట్టిచామంతి నూనె లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నూనె సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది.

Chamomile Oil: To check knee Pain
Chamomile Oil: To check knee Pain

చిట్టి చామంతుల నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ లోపలి పొరల్లోకి చొచ్చుకుని పోయి నొప్పులను తగ్గిస్తుంది. ఈ నూనెను ఆరోమా థెరఫీ లో ఎక్కువగా వాడతారు. 1ML చామంతి నూనెను 5 ML కొబ్బరి నూనెలో కలిపి వాడుకోవచ్చు. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ నూనెను చేతి మీద వేసుకుని వాసన పిలిస్తే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ నూనె నొప్పులను తగ్గించడంతో పాటు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఆ చర్మ సమస్య ఉన్న ప్రదేశంలో ఈ నూనె రాసి మర్దనా చేస్తే ఫలితం కనిపిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.


Share

Related posts

Fish: వారంలో రెండు రోజులు చేపలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు రావు..!!

bharani jella

Today Gold Rate: మళ్ళీ జోరు పెంచిన బంగారం ధరలు..!! నేటి ధరలు ఇలా..

bharani jella

HBD Garuda Ram: గరుడ రామ్ బర్త్డే స్పెషల్ పోస్టర్స్ వైరల్..!! 

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar