జిడ్డు పేరుకు పోయిన వంట గది ని తేలికగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. స్టవ్ మీద మొండి మరకాలు, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటే వేడి నీటిలో , డిటర్జెంట్ పౌడర్ వేసి ఒక క్లోత్ ముంచి స్టవ్ ని ఆ వెనుక ఉండే గోడని కూడా తుడుచుకోవచు..
ఒకవేళ స్టవ్ మీద బాగా జిడ్డు పట్టేసి ఉంటే ముందుగా గ్యాస్ స్టవ్ మీద వంటసోడా ను చల్లండి. ఆ తర్వాత నీటిలో డిటర్జెంట్ వేసి స్పాంజ్‌ను అందులో తడిపి స్టవ్‌ను శుభ్రం చేస్తే…దాని మీద పేరుకుపోయిన మరకలు, జిడ్డు పూర్తిగా తొలగిపోతాయి .జిడ్డు మరకలున్న చోట కొన్ని చుక్కల వెనిగర్ వేసి మూడు నిముషాల తరువాత దాన్ని ఒక స్పాంజీతో తుడిస్తే మరకలు పోతాయి. అయితే మార్బుల్‌తో చేసిన వాటి పై మాత్రం వెనిగర్ వాడకూడదు.
మొండి మరకలన్నీ వేడినీటి తో తుడిచేసి తరువాత బేకింగ్ సోడాని చల్ల్లి నైలాన్ వస్త్రం లేదా ఒక స్క్రబ్బింగ్ స్పాంజీ తో దాన్ని గట్టిగా రుద్ది కొద్దిసేపటి తరువాత వేడినీటితో కడగాలి. అప్పుడు మార్బుల్ పై జిడ్డు తేలికగా పోతుంది. వంట గదిలో ఎక్కడైనా ఏమైనా మరకలు గా అనిపిస్తే ఇలా చేసి చుడండి. గిన్నెలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ లో బ్లీచ్ ఉండడం వలన కొన్ని రకాల మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఈ ద్రావణాన్ని మరకల పై చల్లి స్పాంజీ తో రుద్ది కడిగే స్తే మరకలు పోతాయి.
కొద్దిగా నీళ్ళు , ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా బేకింగ్ సోడా, కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని మరకల పై రాసి బాగా రుద్ది కొద్దిసేపటి తరువాత వేడినీటి తో కడిగేసిన మంచి ఫలితం ఉంటుంది. వంటగది లో వాడే డబ్బాలు జిడ్డు పోగొట్టడానికి కొంచెం వేడి నీటిలో గిన్నెలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ వేసి ఆ మిశ్రమం తో తేలికగా శుభ్రం చేయవచ్చు.