NewsOrbit
హెల్త్

కరివేపాకును తేలికగా పారేయకండి.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి

దక్షిణ భారతదేశంలో రసం చేయాలన్న, రుచికరమైన వంటలు చేయాలంటే కరివేపాకు కచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ తినేటప్పుడు కరివేపాకు కనిపిస్తే చాలు ఖచ్చితంగా తీసివేస్తారు. దీనికి ప్రధానంగా రుచి నచ్చకపోవడే ముఖ్య కారణం. కానీ దాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే పారేయరు. దీని వాసనా కొందరికి మాత్రమే నచ్చుతది. అందుకే చాల మంది కూరలో కరివేపాకు లేకుండా వంటచేయడానికి ఇష్టపడరు. కూరలో కాకుండా మాములుగా కరివేపాకు తీసుకోవడం వలన శరీరంలోని పలు అవయవాలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

 

కరివేపాకులో ముఖ్యంగా ఎ, బి, బి2, సి తోపాటు ఇ విటమిన్లను పుష్కలంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు ఇనుము మరియు కాల్షియం కూడా విరివిరిగా లభిస్తాయి. కంటి సమస్యలు ఉన్నవారికి ఈ కరివేపాకు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. దీనిలో లభించే ఎ విటమిన్ కారణంగా కంటిలో వచ్చే ఇంఫెక్షన్లను తొలగించడమే కాకుండా కంటి చూపును చూడ మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే రెండు రెబ్బలు కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మల బద్ధకం లాంటి సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు కరివేపాకులో ఉండే ఇనుము, కాల్షియం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ ను నియంత్రనాకు కృషి చేస్తుంది.

కరివేపాకులో ఉండే విటమిన్లు తల వెంట్రుకల పెరుగుదలకు సహాయం చేస్తుంది. అంతేకాదు తెల్ల వెంట్రుకలను తగ్గించడమే కాకుండా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఉపశమనాన్ని ఇస్తుంది. కరివేపాకులో బరువును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. కరివేపాకులు బరువును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి స్థాయిలను సైతం తగ్గిస్తుంది. తురిమిన కరివేపాకు, బెల్లంతో కలుపుకుని నిద్రకు ఉపక్రమించే ముందు తినడం ద్వారా కొలెస్ట్రాల్ మరియు గుండెవ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాకులు క్యాన్సర్ వ్యతిరేక ఏజెంట్ వలె కూడా పనిచేస్తాయి. ప్రకాశవంతమైన చర్మం కోసం కరివేపాకుల పొడిని, నిమ్మరసం మరియు రోస్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవడం వలన మీ అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడగలదు. గాయాలను సైతం నయంచేసే గుణాలను కలిగి ఉంది కరివేపాకు. ఇక నైనా కూరలో కరివేపాకు వస్తే పారేయకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri