అందరూ ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉంటే అది దోశ మాత్రమే.. ప్రతిరోజు ఒకేరకమైన దోశ తిని బోర్ కొట్టిందా అయితే ఈసారి స్పెషల్ గా చికెన్ దోశను ట్రై చేయండి ఈ దోసెలో మంచి ప్రోటీన్ లభిస్తుంది.. చక్కటి ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని తీసుకోవచ్చు.. ఇంతకీ చికెన్ దోశను ఎలా తయారు చేసుకోవాలా అనుకుంటున్నారా.!? అయితే ఇలా చేసేయండి..!
చికెన్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు..
అట్టు పిండి, చికెన్ ముక్కలు 200 గ్రాములు, సన్నగా జరిగిన ఉల్లిపాయ ఒకటి, జీలకర్ర ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు, మిరియాలు పొడి ఒక చెంచా, కారం ఒక చెంచా, పసుపు కొద్దిగా, గరం మసాలా ఒక చెంచా, ఉప్పు కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు..
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి మూడు టేబుల్ నూనె వేసి కాగనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి ఐదు నిమిషాలు పాటు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి ఇప్పుడు అందులో గరం మసాలా కారం పసుపు, ఉప్పు అన్ని వేసి కలిపి మరోసారి మూత పెట్టి వేగనివ్వాలి అవన్నీ వేగాక అరకప్పు నీళ్లు పోసి చికెన్ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.. చికెన్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి..
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దోశ పిండితో దోసెను పలచగా వేయాలి. దానిమీద ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి దానిపైన నెయ్యి వేసి దోశ అంతా పరిచేలాగా రాయాలి. దోశ కొద్దిగా కాలిన తర్వాత దాన్ని రోల్ చేసి మరో ఐదు నిమిషాల పాటు కాల్చితే క్రిస్పీ చికెన్ దోశ తినటానికి రెడీ..