కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి.. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్.. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అధిక రక్తపోటు దగ్గర నుంచి అన్ని సమస్యలే.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల జ్యూస్ లు తాగితే సరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!
సాధారణంగా ఎక్కువ మంది టమోటాలను సలాడ్ రూపంలో తీసుకుంటారు.. కానీ ప్రతిరోజు టమోటా జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు టమోటా జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ గా కరిగించడంలో సహాయపడుతుంది.. సొరకాయ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో 98 శాతం నీరు ఉండటం వల్ల అనవసరమైన వ్యర్థ కొవ్వును వేగంగా కరిగిపోతుంది. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..
కాకరకాయ జ్యూస్ కూడా కొలెస్ట్రాలను తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా మంది చేదుగా ఉంటుందన్న కారణంతో దీనిని ఇష్టపడరు.. కానీ కాకరకాయలలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.. ఒకేసారి ఎక్కువగా ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణం చేసుకోలేరు.. దాంతో జీర్ణం కాని ఆహారం అంతా కొలెస్ట్రాల్ గా మారుతుంది. అటువంటి అప్పుడు కాకరకాయ జ్యూస్ తాగితే మాత్రం కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరిగిస్తుంది. ఈ మూడు రకాలు జ్యూస్ లలో మీకు నచ్చిన జ్యూస్ ఎంచుకొని ప్రతిరోజు తాగితే కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చు.