ట్రెండింగ్ హెల్త్

Coconut: కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్ ఒక్కసారి రుచి చూస్తే వదలరు..

Share

Coconut: సమ్మర్ లో చల్లచల్లగా ఏదైనా తాగాలని అందరికీ ఉంటుంది.. వేసవిలో ఆహారం తీసుకోవడం కంటే నీరు ఎక్కువగా తాగుతూ ఉంటాం.. అలా అని ఎక్కువగా నీళ్లు తాగినా కూడా కడుపులో వికారం, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.. అలానే కూల్ డ్రింక్స్ తాగితే ఆనారోగ్య సమస్యలు వస్తాయి.. వీటికి బదులు హెల్దీగా షేక్స్ చేసుకుని తాగండి.. కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Coconut: Dry Nut Milk Shake Health Benefits
Coconut: Dry Nut Milk Shake Health Benefits

కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్ తయారీకి కావలసిన పదార్ధాలు..

కొబ్బరి పాలు ఒక గ్లాసు, జీడిపప్పు -20 , బాదం పప్పు – 20, ఎండు ఖర్జూరం – 5, తేనె ఒక చెంచా అవసరం.

ముందుగా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని పగలగొట్టాలి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ మిల్క్ షేక్ చేసుకోవడానికి ముందుగా బాదం జీడిపప్పు ను 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత బాదంపప్పులను తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండు ఖర్జూరం షేక్ చేసుకునే ఒక గంట ముందు నాన పెట్టుకుంటే చాలు.

 

Coconut: Dry Nut Milk Shake Health Benefits
Coconut: Dry Nut Milk Shake Health Benefits

మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూరం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ముప్పావు వంతు కొబ్బరి పాలను పోసుకొని షేక్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఒక గ్లాసు తీసుకుని అందులో ముందుగా మిగుల్చుకున్న పావు వంతు కొబ్బరి పాలు పోసుకొని.. మిక్సీలో సిద్ధం చేసుకున్న షేక్ అందులోకి పోయాలి. చివరిగా తేనె కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఒక అరగంట ఫ్రిజ్లో ఉంచుకొని చల్లచల్లగా తాగవచ్చు. అంతే కోకోనట్ డ్రైనట్ మిల్క్ షేక్ తాగడానికి రెడీ..


Share

Related posts

Bigg Boss 5 Telugu: మళ్లీ రీ ఎంట్రీ అంటున్న శ్వేత..!!

sekhar

Ragi Malt: ఈ “జావ” ఆరోగ్యానికి ఎంత మేలో తెలిస్తే వదిలిపెట్టరు..

somaraju sharma

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2624 గ్రామ‌, వార్డు వాలంటీర్ జాబ్స్!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar