NewsOrbit
హెల్త్

coconut water : కొబ్బరిలో ఔషధగుణాలు మెండుగా… ఆరోగ్యం నిండుగా..!

Coconut has a lot of medicinal properties ... full of health ..!

coconut water : మన రోజువారి జీవితంలో కొబ్బరికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ప్రతిరోజు కొబ్బెరను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తుంటాము. అదే విధంగా ఏదైనా పండుగలు లేదా శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు మంచిగా జరగాలని భావించి దేవుడికి కొబ్బరికాయ సమర్పించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ కొబ్బరిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉండడమే కాకుండా మన రోజువారి జీవితంలో కొబ్బరి చెట్టు నుంచి లభించే కొబ్బరికాయ, కొబ్బరినీళ్లు, కొబ్బరి మట్టలు, పీచు మొదలైనవి ప్రతి ఒక్కటి మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా కొబ్బెర ప్రతిరోజు మనం ఏదో రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.అయితే కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

Coconut has a lot of medicinal properties ... full of health ..!
Coconut has a lot of medicinal properties full of health

కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

ఎటువంటి కల్తీ లేని సహజసిద్ధమైన ప్రకృతి నుంచి లభించే వాటిలో కొబ్బరి ఒకటని చెప్పవచ్చు. ఈ సహజ సిద్ధమైన కొబ్బరిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. తరచూ కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల వారి శరీరంలోని షుగర్ లెవెల్స్ పడిపోకుండా సాధారణ స్థాయిలో ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ జరగడానికి కీలక పాత్ర పోషిస్తుంది. వేసవికాలంలో ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం తాగడం వల్ల డీహైడ్రేషన్ వంటి సమస్యలకు గురి కాకుండా వడదెబ్బ నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

కొబ్బరి బోండా లో పొటాషియం, మెగ్నీషియం సీఎం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అందుకోసమే నీరసంగా ఉన్నవారికి కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. శరీరంలో వేడిని తగ్గించి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది. అదే విధంగా కొబ్బరి నుంచి వచ్చే నూనెను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా కొబ్బరి పీచును ఇంటికి అలంకరణ వస్తువులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇక ఏదైనా శుభకార్యం జరిగితే మన ఇంట్లో కొబ్బరి కాయలతో పాటు కొబ్బరి మట్టలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యప్రయోజనాలకు, నిత్యావసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri