Drinking Water: నీరు తాగేటప్పుడు ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి..!!

Share

Drinking Water: దేహంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీటిని అందించాలి.. అందుకే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగమని వైద్యులు చెబుతుంటారు.. నీటిని తాగడమే కాదు ఎలా తాగుతున్నామనేది అంతకంటే ముఖ్యం.. మనలో చాలా మంది చేసే ఈ తప్పులు సరిచేసుకుంటే చాలు.. మన ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. ఇంతకీ ఆ తప్పులు ఏంటంటే..!?

Common Mistakes While Drinking Water:
Common Mistakes While Drinking Water:

సాధారణంగా మనలో చాలా మంది నీటిని నిలబడి తాగుతుంటారు. నిల్చొని నీళ్లు తాగితే నరాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ద్రవ్య సమతుల్యత దెబ్బతినడం, అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు తాగితే అది కింద పొట్టలోకి వెళ్తుంది. ఇది మీకు పోషకాలను అందనివ్వదు. అలాగే కొంత మంది నీటిని తాగకుండా మింగేస్తుంటారు. ఇలా చేస్తే మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఇంకా మూత్రాశయం లో కలుషితాలు చేరతాయి.

Common Mistakes While Drinking Water:
Common Mistakes While Drinking Water:

భోజనానికి ముందు నీరు తాగితే బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోగా జీర్ణ వ్యవస్థ ను అస్తవ్యస్తం చేస్తాయి. ఇంకా వికారం, మలబద్దకం బోనస్. వ్యాయామానికి ముందు, వెంటనే నీరు తాగకూడదు. దీని వలన తలనొప్పి వస్తుంది. అందువలన వ్యాయామానికి ముందు, తర్వాత 30 నుంచి 45 నిమిషాల తరువాత మాత్రమే తాగాలి. అలాగే చల్లటి నీటిని తాగడం తగ్గించండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రత ను పెంచి ఆహారం జీర్ణం కావడానికి ఆలస్యం చేస్తుంది. సాధ్యమైనంత వరకు గోరు వెచ్చటి నీరు తాగండి. ఇది ఆరోగ్యానికి మంచిది.


Share

Related posts

నిమ్మగడ్డ రీఎంట్రీ ! గవర్నర్ ద్వారా రానున్న మాజీ ఎస్.ఇ.సి?

Yandamuri

Bala Krishna: షూట్ లో బాలకృష్ణ కాలికి గాయాలు …!?

Ram

AP Police : మానవత్వం చాటిన విశాఖ రాంపల్లి పోలీసులు…ప్రశంసించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

somaraju sharma