అబ్బాయిల తో పోలిస్తే అమ్మాయిలే దానికి బాగా బానిసలవుతున్నారు!!

సోషల్ మీడియా కు అమ్మాయి లు బానిసలు గా మారుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్య ల కు  గురి అవుతున్నారు అని నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజు రోజు కీ సోషల్ మీడియా కు అంకితమైపోతూతమకు సంబంధించిన ప్రతి విషయాలని వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఫ్రెండ్స్ తోపంచుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అబ్బాయిల తో పోలిస్తే అమ్మాయిలే దానికి బాగా బానిసలవుతున్నారు!!

తమ ఫొటోస్ లేదా వీడియోస్ విపరీతం గా అప్లోడ్ చేసేసి తమ కన్న పక్క వారికి కామెంట్స్ , లైక్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ బాధపడుతూ ఉంటారు.  ఇలా చీటికీ మాటికీ అందరికి అప్‌డేట్స్ ఇస్తూ మోసగాళ్ల వలలో చిక్కి, వేధింపుల‌కి గురవుతూ తీవ్ర నిరాశలో కురుకుపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.. తాము మోసపోయాము అని ఎవ్వరికి చెప్పుకోలేక ఏమి చేయాలో తోచక  అశాంతి,ఒత్తిడి, ఒంటరితనం, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యల కు గురవుతున్నారని నిపుణులు అంటున్నారు.

కాబట్టి అడ పిల్లలు విలైనంత వరకు సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. అబ్బాయిలతో పోలిస్తే 25 శాతం అధికంగా అమ్మాయిలు సోషల్ మీడియా దుష్ప్రభావాలకు గురవుతున్నరు. సోషల్ మీడియా కారణం గా 40 శాతం  అమ్మాయి లు నిద్రలేమి సమస్య తో ఇబ్బందిపడుతున్నారు.  సోషల్ మీడియా వాడకంలో యుక్త వయ్యస్సులో ఉన్నవారు పరిమితులుపెట్టుకోక పొతే భవిష్యత్‌లో మరిన్నీ సమస్యలు ఎదురుక్కోక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియా లో ఏర్పడే పరిచయాలు బెదిరింపులకు దారితీసి, ఆత్మహత్యలవరకు తీసుకువెళుతున్నాయి అంటే పరిస్థితి ఎంతదారుణం గా ఉందో అర్థంచేసుకోవాలి. సోషల్ మీడియా వేదికగా స్త్రీలకు వేధింపు లు ఎక్కువవుతున్నాయి కాబట్టి ఎవ్వరికి వారు సోషల్ మీడియాలో హద్దులు పెట్టుకుని ప్రవర్తిస్తే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు.