Coniferous Plant: మన ముఖమే అందరిని ఆకర్షిస్తుంది.. అటువంటి మోముపై చిన్న మొటిమ గాని మచ్చ కాని ఉంటే కాంతివిహీనంగా కనిపిస్తాము.. మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టి అందంగా కనిపించాలి అనుకుంటున్నారా..!? అయితే ఈ పూలతో ఇలా ట్రై చేయండి చాలు..!!
శంకు పుష్పాలలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ పూలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న శంఖ పుష్పం కషాయాన్ని తాగితే చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
శంకు పుష్పాల కషాయం లో ఉండే పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరగటం వలన మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. చిన్న వయసులో ముఖంపై వచ్చే ముడతలను తొలగిస్తుంది. వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. చర్మ సౌందర్యాన్ని పెంచి నిత్య యవ్వనంగా కనబడేలా చేస్తుంది. పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ చేకూరాలంటే ప్రతి రోజు శంకు పుష్పం కషాయాన్ని తాగాల్సిందే.