ఇలా చేయడం వలన ఒత్తిడి అన్న మాటే ఉండదు!!

మనసుకు బాధ కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడి కి గురవుతుందని పరిశోధకులు గుర్తించారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆయుష్షును సైతం తగ్గించేస్తుందని గతంలో జరిపిన పరిశోధనల లో కూడా తేలింది. ఒత్తిడి అనిపించినప్పుడు మీకు బాగా నచ్చిన పనిచేయండి. అంటే కొంతమంది కి వంట చేయడమంటే ఇష్టం, మరికొంతమందికి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. ఇలాంటి నచ్చిన పనులు చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

ఇలా చేయడం వలన ఒత్తిడి అన్న మాటే ఉండదు!!మీ మనసుకుసన్నిహితం అనుకున్న వారితో మాట్లాడడం వలన బాధ కొంచెమైనా తగ్గుతుంది. ఇక ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయామం చేయడం వల్ల కూడాప్రయోజనం ఉంటుంది. కాసేపు అటు ఇటు నడుస్తూ ఉండడం, జోక్స్  చదివి నవ్వుకోవడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.ముఖ్యంగా జంక్‌పుడ్‌ని మానేసి పూర్తిగా తాజా ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.

పండ్ల ముక్కలు, సలాడ్లు తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. యోగా, శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు చేయడంవల్ల మనసు ప్రశాంతం గా మారుతుంది. గట్టిగా గాలి పీల్చి వదలడం కొన్ని సార్లు చేయటము వల్ల కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించి ఆందోళన, ఒత్తిడి ల నుంచి విడుదల చేస్తుంది .. మంచి సంగీతము వినటము వలన మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరము చేసుకోవచ్చు అని పరిశొధనలు తెలుపుతున్నాయి కాబట్టి మనస్సును ఆహ్లాదపరిచే సంగీతాన్ని మంద స్వరములో వినాలి. “అరోమతెరపి” వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని .పరిశొధనల తో శాస్త్రవేత్తలుతెలుసుకున్నారు. అత్తర్లు లావెండర్,సెంట్లు వంటి సుగంధ

ద్రవ్యాలు ఒత్తిడిని తగ్గించటములో  బాగా పనిచేస్తాయి.నవ్వు,ఆందోళన,ఒత్తిడులకు దివ్య ఔషదముగా పనిచేస్తుంది.ఎందుకంటే  నవ్వేటప్పుడు ఎండోర్ఫిన్స్ అనే హార్మోను లు విడుదల వలన ఒత్తిడి ని తగ్గిస్తాయి కాబట్టి ఆందోళన ఒత్తిడులు ఎదురైనప్పుడు టి.వి లో కామెడి చానళ్ళు చూస్తూ హాయిగా బిగ్గరగా నవ్వండి.  స్నేహితులతో జోక్స్ పంచుకొని హాయిగా నవ్వుకోండి.సరిపడినంత నిద్ర లేక పోవడం వలన కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి ప్రశాంతం గా నిద్రపోయేందుకు ప్రణాళిక వేసుకోవాలి.