Couples : పెంపుడు జంతువులు ఉండే దంపతులలో అరవై మూడు శాతం మంది సరిగ్గా నిద్ర పోవడం లేదట. ఎందుకంటే పెట్స్ మీ నిద్ర కు భంగం కలిగిస్తూ ఉంటాయి. అవి దంపతుల ఏకాంతాన్ని కూడా డిస్టర్బె చేస్తుంటాయి. కాబట్టి వాటిని దూరం గా వాటి ప్లేసులో వాటిని ఉంచాలి. మందు తాగడం , సిగరెట్ వంటి అలవాట్లు ఉన్నవారు పడుకోవడానికి వెళ్లేముందు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వాటి వలన నిద్ర సరిగా పట్టక లేదా మత్తు ఎక్కువ అవడం వలన ఆ అలసట మరుసటి రోజు మీ పని మీద ప్రభావం చూపిస్తుంది. అందునా మీ భాగస్వామి కి వాటి మీద అయిష్టత ఉంటె అది మీ మీదకు కూడా వచ్చే అవకాశం ఉంది.
నిద్రకు ఉపక్రమించే ముందు ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతిగా చెప్పబడింది. ఈ పద్దతి వలన ఇద్దరికీ ఒత్తిడి తగ్గి ప్రశాంతం గా నిద్రపోయే అవకాశం ఉంది.పడకగది అంటే కేవలం పడుకోవడం కోసం మాత్రమే కాదు ప్రేమ గా ఉండే ప్రదేశము కూడా అని మరువకండి . ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవాలి. ఎదో కలిసాం.. పడుకున్నాం అన్నట్లు కాకుండా.. మీ భాగస్వామి ని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ప్రేమ గా దగ్గరకు తీసుకోడం వంటి చర్యల ద్వారా మీ లో ఉన్న ప్రేమను మీ భాగస్వామికి తెలిసేలా చేయాలి.
బయట ఉన్నంత సేపు గొడవపడి మౌనం గా ఉన్న గదిలోకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయి కాస్త నెమ్మదించడం మంచిది. అలాగే బెడ్ రూమ్ ఎప్పుడు చాలా ప్రశాంతం గా శుభ్రం గా ఉతికిన బెడ్ షీట్స్ తో నీట్ గా సర్ది మీకు ఇష్టమైన సువాసన వెదజల్లుతూ ఉండాలి. బెదురూమ్ లోకి వెళ్లడమే ప్రశాంతత మీ సొంతం అయ్యేలా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మీ బంధం ఎప్పుడు బావుంటుంది.