Paneer: ఇండియా గూగుల్ సెర్చ్ లో ఎక్కువమంది అడిగే రెసిపీ ఏంటంటే పన్నీర్ ఎలా తయారు చేయాలి అని.. పన్నీర్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఇందులో మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. పైగా ఇది శాఖాహారం.. ఇప్పుడు వరకు పన్నీర్ అంటే పాలతో తయారు చేయడం గురించి అందరికీ తెలుసు.. పాలు తో కాకుండా మన ఇంట్లో మిగిలిపోయిన పెరుగుతో కూడా పన్నీర్ చేసుకోవచ్చు.. ప్రతిసారి అదే కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునే వారికి.. పెరుగు తో కూడా పన్నీర్ చేయవచ్చు.. ఇది పాలతో తయారు చేసిన పనీర్ కంటే రెండు రెట్లు టేస్టీగా ఉంటుంది ఇంతకీ పెరుగుతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!
పెరుగు తో పన్నీర్ తయారు చేసే విధానం..!
మూడు కప్పుల పాలు, ఒక కప్పున్నర పెరుగు ఇందుకు అవసరం. ముందుగా వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో మూడు కప్పుల పాలు పోసి బాగా మరిగించాలి. మరో వైపు పిన్ని పెరుగులో మెత్తగా మజ్జిగ కవ్వంతో చిలకాలి. లేదంటే స్పూన్ తో లస్సీ మాదిరిగా స్మూత్ గా చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత ఆ వేడి వేడి పాలలో పెరుగు వేసి బాగా కలపాలి ఈ రెండు బాగా కలిసిన తర్వాత పాలలో నీరు పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నీటిని వంపేయాలి. ఏదైనా నా కాటన్ క్లాత్ తీసుకుని అందులోకి ఈ మిశ్రమం వేసి అందులో ఉన్న నీళ్లన్నీ గట్టిగా పిండేసి దానిపైన ఒక బరువైన గిన్నెను పెట్టి ఉంచాలి.
అందులో ఉన్న నీళ్లన్నీ పోయి పన్నీర్ గట్టిగా ముద్దగా అవుతుంది.. ఇప్పుడు ఆ పన్నీర్ ను ఒక నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి ఇలా ఉంచితే పన్నీర్ గట్టి పడుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన ఆకారంలో పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకుని కూర వండుకోవచ్చు. అంతే పెరుగుతో ఇలా సింపుల్ గా పన్నీర్ చేసుకోవచ్చు.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…