Amavasya : అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు  వేయకూడదు అని తెలుసా?దానికి కారణం ఇదే !!

Share

Amavasya : జాగ్రత్తలు, నియమాలు
ఇంటి ముందు వాకిలి లో ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాల విషయాలు తెలుసుకున్నాం.  అయితే ఇంటి ముందు ముగ్గు వేయడంలో   కొన్ని జాగ్రత్తలు, నియమాలు కచ్చితం గా  పాటించాలి. అప్పుడే.. ముగ్గు వేసుకోవడం వలన వచ్చే  ప్రయోజనాలు పొందగలుగుతాం. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయపరమైన విషయాల దగ్గరనుండి , ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఇలా ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి.

Amavasya : అమావాస్య రోజున

మన పెద్దలు పెట్టిన   ఆచారాలు ఏ ఒక్కటీ కూడా మూఢనమ్మకం కానే కాదు. ఎందుకంటే ప్రతి ఆచారం వెనక ఒక అంతరార్థం దాగి ఉంటుంది.   సాధారణంగా ప్రతి  ఇంట్లో స్త్రీలు    ఉదయం లేవగానే ఇంటి ముందు ఉన్న చెత్తను  ఊడ్చి శుభ్రం చేసి నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గులు వేయటం అనేది జరుగుతూనే ఉంటుంది. దాంతో ఇంటి ముందు   అంతా అందంగా ఆకర్షణీయంగా,శుభకరం గా  ఉంటుంది.
కానీ  పండితులు అమావాస్య రోజున మాత్రం వాకిట్లో  ముగ్గులు వేయకూడదని  సూచిస్తున్నారు. అమావాస్య   రోజున ఇంటికి పితృ దేవతలు వస్తారు.  కాబట్టి  ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమివడం,బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం వంటివి చేయడం వలన   వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు  కలుగుతాయి అని  పండితులు  తెలియచేస్తున్నారు.

 పితృ దేవతలు

కాబట్టి ఆరోజు ఇంటిముందు వున్న చెత్తను ఊడ్చి శుభ్రం చేసుకుని, నీటిని చల్లుకోవాలి కానీ  ముగ్గులు మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయకూడదని  తెలిసిచ్చేస్తున్నారు నిపుణులు.     ముగ్గులు వేయడం వలన  పితృ దేవతలు రాకుండా ఇంటి బయట వాకిలిలోనే ఆగిపోతారు అని తెలియచేస్తున్నారు.అమావాస్య రోజున పితృ దేవతలను మనసారా ప్రార్ధించాలని పండితులు తెలియచేస్తున్నారు. అమావాస్య  పితృ దేవతలకు చాలా ప్రీతికరమైన రోజు గా చెప్పబడింది. ఆ రోజు పితృ దేవతలను కొలిస్తే సకల  శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు.


Share

Related posts

Sannajaji: ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!!

bharani jella

రోజూ భోజనంలో ఇది తప్పకుండా తీసుకుంటే రోగాలు దరిచేరవు

Kumar

Romance: స్త్రీల కు  శృంగార  క్రీడకు ముందు  వీటిని ఇస్తే,ఇక మిమ్మల్ని వదిలి పెట్టరు !!

siddhu