Childrens: మీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు కచ్చితంగా ఈ విషయాల  గురించి కూడా ఆలోచించండి  !!

Share

Childrens: ఈ రోజుల్లో పిల్లల విషయంలో చాలా కష్టం అనిపించేది ఏదైనా ఉంది అంటే   అది పేరుపెట్టడమే అని టక్కున చెప్పేయవచ్చు.  ఎందుకంటే… ఇప్పటికే ఎన్నో రకాల పేర్లు రావడం   కాలం లో కలిసిపోవడం కూడా  జరిగింది.   అంత త్వరగా రొటీన్ పేర్లు పెట్టాలి అని అనిపించదు.  అలాగే డిఫరెంట్ గా ఉండే  పేరు పెడితే క్యాచీగా ఉన్నట్టు అనిపించదు. పెద్ద పేరు ఏదైనా   సెలెక్ట్ చేద్దాము అని అనుకుంటే అంత పెద్దది పిలవలేక… తోక పేర్లతో   పిలిచేస్తారు. పోనీ చిన్న పేరు  పెడితే,అదే పేరుతో ఇంకెవరైనా ఉంటే అంతా  గందరగోళమే.  కాబట్టే పిల్లలకు  పేరు పెట్టడం అనేది కష్టమైన పని.  ఐతే అస్సలు పిల్లలకు పేరు పెట్టేందుకు ఏయే విషయాలు దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్ చేసుకోవాలి అనేది  ఓ సారి తెలుసుకుందాం.

Definitely think about these things too when naming your baby !!
Definitely think about these things too when naming your baby !!

పిల్లలకు పెట్టే పేర్లు అరుదైనది కావడం తో పాటు ప్రత్యేకమైనది గా ఉండాలి.  పేరు  ఏ విధం గా కూడా  ఫన్నీగా ఉండకూడదు. ఇలాంటి  ఫన్నీ పేరు పెడితే… చిన్నారికి  భవిష్యత్తులో   చాలా ఇబ్బంది  పడవలసి వస్తుంది.ఒకసారి పేరు అన్నది పెట్టాక… ఇక  పిల్లలు  ఆ పేరుతోనే జీవితాంతం  బతకాలి. కాబట్టి  ఒకటికి పది సార్లు బాగా ఆలోచించి  ఫైనల్ గా ఒక మంచి పేరు సెలెక్ట్ చేయాలి. కొన్ని పేర్లు వింటుంటే అది అమ్మాయి పేరా లేదా అబ్బాయి పేరా అని డౌట్ వస్తుంటుంది .   ఉదాహరణకు అబ్బాయి కి  శశి అని ఉమా అని పెట్టకూడదు.  దానికి కారణం   ఆ పేర్లు వినగానే  ఎవరికైనా అమ్మాయి గుర్తుకు వస్తుంది . అలాగే అమ్మాయికి తరుణ్, వరుణ్,హర్ష ,కృష్ణ  వంటి పేర్లు పెట్టకూడదు. అలా  పెడతారా అని డౌట్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది. ఉదాహరణకు మురళి కృష్ణ కుమారి అనే పేరు ఉంటే అందరూ సింపుల్ గా మురళి అని పిలుస్తారు. హర్ష శ్రీ ఉందనుకోండి.. హర్ష అనే పిలుస్తారు కాబట్టి  ఈ విషయంలో  తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Definitely think about these things too when naming your baby !!
Definitely think about these things too when naming your baby !!

చాలా మంది నిక్ నేమ్ తో పిలుస్తుంటారు.పిల్లలకి  పెట్టే పేరు లోనే  నిక్‌నేమ్ కూడా కలిసి ఉండే విధంగా   సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు   లోకజ్ఞా అనే పేరులో నుంచీ  లక్కీ నిక్‌నేమ్  తీసుకోవచ్చు.అసలు పేరు ఎంత  అర్ధవంతం గా అందంగా పెడతామో  , నిక్ నేమ్ కూడా  అలానే ఉండాలి. ఉదాహరణకు  ఇవన్నీ పేరు పెట్టాలి అని అనుకునే ముందు ఆలోచించుకోవాలి. ఈ నిక్‌నేమ్ ఎంత ముఖ్యమైనది అంటే  స్కూల్, కాలేజీ లోనే కాదు,  బ్యాంకులు కూడా ట్రాన్సాక్షన్ల టైమ్‌లో నిక్ నేమ్  ని అడుగుతున్నాయి. అందువల్ల దీనిపై దృష్టి పెట్టుకోవాలి. పేరంటే ఒక్క పదం  కావచ్చు . లలిత కుమారి,  సాయి తేజ ఇలా రెండు మూడు పేర్లు  కలిపి  పెట్టుకోవాలి.  ఇలా  రెండు పేర్లు  కలిపి పెట్టాలనుకుంటే  మాత్రం ఆ  పేర్లు  కలిసే విధంగా     పిలవడానికి తేలిక గా ఉండేలా పెట్టుకోవాలి.     కొంతమంది ఇంట్లో పూర్వీకులు, పెద్దవాళ్ల పేర్లు  కలిపి    పిల్లలకు పెడుతున్నారు. సెంటిమెంట్ కోసం అలా  చేయాల్సిన   అది పిల్లలు  పెరిగి పెద్దయ్యాక ఇబ్బంది  గా మారుతుంది. అందువల్ల అలాంటి వాటితో సంబంధం లేకుండా  పేరు పెట్టాలి.

Definitely think about these things too when naming your baby !!
Definitely think about these things too when naming your baby !!

ఇంటి పేరు ఎలాగూ ఉంటుంది కాబట్టి, మళ్లీ అదనంగా పెద్దవాళ్ల పేర్లు చేర్చడం వలన పిల్లలకు ఇబ్బంది తప్ప ఏమి ఉండదు.  కొత్తగా ఉండాలంటే మిక్సింగ్ నేమ్స్‌పై దృష్టి  పెట్టాలి.తిథులు, నక్షత్రాలు, వారఫలాలు ఇలాంటి సెంటిమెంట్ ఉన్నా వాటిని లెక్కలోకి తీసుకుంటూనే… పాత పేరు  కాకుండా… కాస్త ఇప్పటి ట్రెండ్‌కి తగిన పేరు  పెట్టెలా చూడాలి. ఇంకో విషయం ఏమిటంటే మీరు పెట్టే పేరు ఇతర భాషల్లో చెడు పదం కాకుండా ఉండేలా జాగ్రత్త పడండి.  కాబట్టి  పేరు పెట్టేటప్పుడు… కనీసం ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి ప్రధానమైన  భాషల్లో ఆ పేరుకు ఎలాంటి అర్థాలు ఉన్నాయి అనేది  తెలుసుకోవడం మంచిది. మొదటి  బిడ్డ అయినా అయినా, రెండో  బిడ్డ అయినా.. పేరు పెట్టే విషయంలో మాత్రం  ప్రత్యేకమే  కాబట్టి మీరు పెట్టిన పేరును  పిల్లలు తలచుకుంటూ, జీవితం మొత్తం మీకు థాంక్స్  చెప్పుకుంటుండాలి. ఇలాంటి పేరు మీరు  సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి.


Share

Related posts

రైతు అంటాడు… కథలు చెబుతాడు ; రైతుల పోరాటంపై పవన్ వింత వైఖరి

Special Bureau

బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు..!

Arun BRK

రాజకీయ ఇబ్బందుల్లో రోజా..! ఇక తేరుకోవడం కష్టమే..!!

Muraliak