Diabetes: మన రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు కారణంగా డయాబెటిస్ వస్తుంది.. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రతిరోజు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.. పైగా అనారోగ్య సమస్యల బారిన పడేట్టు చేస్తుంది.. ఈ సమస్యతో బాధపడుతున్న వారు డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. వీటిని పాటిస్తే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది..!

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రైస్, పాలిష్ పట్టిన బియ్యం తీసుకోవటం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది . ఈ రెండింటి కంటే కూడా గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే గోధుమపిండి అయితే బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. చపాతి తీసుకున్నట్టయితే రోజుకు రెండు మాత్రమే తీసుకోవాలి. అదే ఆహారమైతే ఒక కప్పు మాత్రమే తినాలి. బీట్ రూట్, బంగళా దుంప సాధ్యమైనంత వరకు తీసుకోవడం తగ్గించాలి. మిగతా అన్ని రకాల కూరగాయలను మధుమేహులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సలాడ్స్, పెరుగు కూడా తీసుకోవచ్చు.

అల్పాహారం విషయానికి వస్తే ఇడ్లీ, అట్టు తీసుకోకపోవడమే ఉత్తమం. బ్రౌన్ ఉప్మా, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా తీసుకోవాలి. అదే పండ్ల ఈ విషయంలో అయితే ఆపిల్, జామ, కమలా కాయ, బత్తాయి కాయ నేరుగా తీసుకోవడం మంచిది. వీటి రసాలను తీసుకోవద్దు. మిగతా ఫ్రూట్స్ మీ షుగర్ లెవెల్స్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ లు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉన్న వారు 100 గ్రాముల ఏ ఫ్రూట్ ని తీసుకున్న కూడా పర్వాలేదు. ప్రోటీన్, సోయాతో నిండిన స్నాక్స్ తీసుకోవడం బెస్ట్.