NewsOrbit
హెల్త్

Peanut butter: షుగర్ వ్యాధిగ్రస్థులు వేరుశెనగ వెన్నను తింటే ఏమవుతుందో తెలుసుకోండి.!

Peanut butter: పీనట్ బటర్ గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. పీనట్ బటర్ అంటే వేరుశెనగ వెన్న అని అర్ధం. ఈ వేరుశెనగ వెన్నను వయసుతో పనిలేకుండా అన్ని రకాల వయస్సుల వారు ఎంతగానో ఇష్టపడతారు.ఈ పీనట్ బటర్ ను స్నాక్స్ లోను,బ్రెడ్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.అయితే ఈ పీనట్ బటర్ ను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ దీనిని కొంచెం కొంచెంగా తినాలి.మరి మధుమేహం ఉన్నవారు వేరుశెనగ వెన్న తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Peanut butter: పీనట్ బటర్ యొక్క ఉపయోగాలు :

మధుమేహ వ్యాధి గ్రస్థులు పీనట్ బటర్ ని తినవచ్చు.ఎందుకంటే ఇది శరీరంలోని చెడు కొవ్వుల పరిమాణాన్ని తగ్గిస్థాయి.అలాగే ఈ వేరుశెనగ వెన్నలో చక్కెర మరియు ఉప్పుల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది.ముఖ్యంగా ఆర్గానిక్ పీనట్ బటర్ వంటి ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.నిజానికి పీనట్ బటర్ అనేది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడినప్పటికీ కొన్ని కొన్ని సార్లు అలెర్జీలకు కూడా కారణం కావచ్చు.కాబట్టి ఎలర్జీతో ఇబ్బందిపడే షుగర్ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ వెన్నను తినకుండా ఉంటేనే మంచిది.

షుగర్ వ్యాధి గ్రస్థులకు పీనట్ బటర్ ఎలా ఉపయోగపదుతుందంటే..?

పీనట్ బటర్ తినడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఎందుకంటే వేరుశెనగ మరియు వేరుశెనగ వెన్న రెండిటిలోనూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరగదు.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శరీర బరువును అదుపులో ఉంచడంలో వేరుశెనగ వెన్న సహాయపడుతుంది. పీనట్ బటర్ లో అధిక ప్రోటీన్లు అలాగే ఆరోగ్యకరమైన నూనెలు లభ్యమవుతాయి. ఇవి డయాబెటీస్ ని అలాగే అల్జీమర్ వ్యాధిని నిరోధించేందుకు ఉపయోగపడతాయి.

పీనట్ బటర్ ను ఎంత మోతాదులో తినాలంటే..?

మధుమేహం ఉన్నవారికి సాధారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ హృదయం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే 100 శాతం సహజంగా లభించే ఆర్గానిక్ వేరుశెనగ వెన్న వంటి ఆహారాలను తింటే మంచిది.అయితే మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి.పీనట్ బటర్ ఆరోగ్యానికి మంచిది అన్నాం కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పీనట్ బటర్ ను ఎప్పుడూ కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri