Carona: కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులు వెంటనే చేయవలసిన పని టూత్ బ్రష్‌ను మార్చడం అని తెలియచేస్తున్నారు దంతవైద్యులు . కోవిడ్ వచ్చిన సమయంలో వాడిన టూత్ బ్రష్‌లో వైరస్ అలాగే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో కరోనా తగ్గిన తర్వాత కూడా అదే బ్రష్ తో బ్రష్ చేస్తే, మళ్లీ పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలియచేస్తున్నారు.
మీకు లేదా మీ కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ లో ఎవరైనా కరోనా బారిన పడి కోలుకున్న వారు ఉంటే , దయచేసి వెంటనే వారి టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ వంటివి వెంటనే తీసివేయడం మంచిది. ఎందుకంటే ఇవి వైరస్‌ను వ్యాపింపజేయడంలో ముందు ఉంటాయి. ఇదే విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా . అందువల్ల, సీజనల్‌గా వచ్చే జలుబు,ఫ్లూ, దగ్గు, నుంచి కోలుకున్నవారు కూడా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చాలని సూచిస్తున్నారు.కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ లను మార్చండి. టూత్ బ్రష్ మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ కారణంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది . నోటిలో ఉన్న వైరస్ లేదా బ్యాక్టీరియా ను తొలగించుకోవడానికి మౌత్ వాష్ లేదా బెటాడిన్ గార్గిల్ వాడాలి. ఒకవేళ మౌత్ వాష్ అందుబాటులో లేకపోతే గోరువెచ్చని సెలైన్ నీళ్లతో తో నోరు శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి నోరు శుభ్రం చేస్తే ప్రమాదం నుంచి బయట పడతాము.
వైరస్ సోకిన వ్యక్తి తుమ్ము,దగ్గు, అరవడం, మాట్లాడటం, నవ్వడం వంటివి చేసినప్పుడు వారి నోటి నుంచి తుంపర్లు ఎదుటి వ్యక్తిపై పడి ఇతరులకు వైరస్ వెంటనే వ్యాపిస్తుంది. వీటితో పాటు కలుషితమైన భాగాలు తాకడం, చేతులు శుభ్రపరుచుకో కుండా కళ్ళు, ముక్కు లేదా నోటి ని ముట్టుకోవడం వలన కూడా వ్యాధి బారిన పడొచ్చు. కాబట్టి ఈ విషయాలను కరోనా రోగులు గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని,నిపుణులు సూచిస్తున్నారు.