Eat: పార్టీకో.. ఫంక్షన్ కో.. ఎక్కడికైనా వెళితే కాస్త ఎక్కువగా ఆహార పదార్థాలను లాగించేస్తాం.. ఒక్కోసారీ ఇంట్లో కూడా మనకు నచ్చిన ఆహారం ఏదైనా ఇష్టంగా అనిపిస్తే ఫుల్లుగా తినేస్తాం . ఆ తరువాత అరగక ఇబ్బందులు పడుతూ ఉంటాము.. ఆహారం అతిగా తింటే అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.. అయితే కొన్ని ఆహార పదార్థాలను అతిగా తిన్నప్పుడు వాటికి విరుగుడుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పళ్ళు ఎక్కువగా తింటే వెంటనే నెయ్యి, పంచదార ఒక స్పూను కలుపుకొని తినండి.
పుల్లటి పదార్థాలు కానీ పండ్లు కానీ ఎక్కువగా తిన్నప్పుడు బెల్లం కాస్త వెంటనే తింటే పుల్లటి త్రేంపులు రాకుండా ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు.
ఉలవచారు తింటున్నారా.. అయితే ఉలవచారుకు నెయ్యి పోపు వేసి పెట్టుకోండి .నెయ్యి చేర్చి ఉలవచారు తింటే అజీర్తి కలగదు. ఉలవచారు తినేటప్పుడు కాస్త ఆ అన్నంలో నెయ్యి వేసుకుని తింటే.. గ్యాస్ సమస్యలే రావు.
పెసరపప్పు తింటున్నారా.. అయితే మీకు కాస్త కడుపు ఉబ్బరంగా ఉందా.. వెంటనే ఉసిరికాయ పచ్చడి తినండి. చక్కటి ఉపశమనం కలుగుతుంది.
మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఒక గ్లాసు పాలు తాగితే విరుగుడుగా పనిచేస్తుంది.
చేపలు కూర ఫుల్ గా లాగిన్చేశారా.. అయితే వెంటనే మామిడికాయ జ్యూస్ కానీ మామిడికాయ పండును కానీ తినండి. చక్కటి రిలీఫ్ ఉంటుంది.
బాదం పప్పులు రోజుకి మూడు నుంచి ఐదు తినొచ్చు. అంతకంటే ఎక్కువగా తింటే తల తిరిగినట్టు, వికారంగా అనిపిస్తుంది . ఒకవేళ మీకు అలా అనిపిస్తే గనక వెంటనే రెండు లవంగాలు నోట్లో వేసుకోండి. ఆ బాధ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
రుచిగా ఉన్నాయి కదా అని పకోడీలు ఫుల్లుగా లాగించేస్తున్నారా? అయితే రెండు చెంచాల ముల్లంగి రసం తీసుకోండి..
గారెలు ఎక్కువగా తింటే వెంటనే ఓ గ్లాసు మజ్జిగలో తాగండి.
ఈ ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటివి చేస్తే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.