pregnant issues: కూల్ డ్రింక్స్ లో తియ్యటి రుచికోసం కృత్రిమ చక్కెరను వాడతారు. ఇది ఎండోక్రైన్ గ్రంధుల మీద చెడు ప్రభావాన్ని చూపడం వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతోంది.సోడాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే ఆడవారిలో అండాశయ సమస్యలు రావడం తో పాటు ప్రీ మెన్స్టురల్ సింటమ్స్ లో హెచ్చుతగ్గులు వస్తాయి.ఈ కృత్రిమ చక్కెర వల్ల సంతానోత్పత్తి సమస్యలు,గర్భస్రావాలు, గర్భస్థ శిశువుకి వైకల్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువ తీయగా ఉండే తియ్యని చెక్కరల వలన , వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. సంతానోత్పత్తికి కావలసిన అనుకూలత శరీరం లో తగ్గిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత తో పాటు ఊబకాయ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, వాటి జీవత్వం, చలనశక్తి తగ్గే అవకాశం ఉంది. సోడా ల్లో ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిల్ల పీహెచ్ శాతం మారుతూ ఉంటుంది. శరీరంలో పీహెచ్ ఎక్కువైతే పోషకాలు నశించి పోతాయి. దీనివల్ల వీర్యకణాల నాణ్యత లోపించడం ఆకారం మారడం, లేదా వీర్యకణాలు చనిపోవడం వంటివి జరగవచ్చు.కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా కెఫిన్ ,ఫ్రక్టోస్ లు ఉంటాయి. వీటివల్ల స్త్రీలలో అండాశయ సమస్యల తో పాటు సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతాయి .
కెఫిన్ కారణంగా రక్త నాళాలు ముడుచుకు పోవడంతో గర్భాశయంలోకి రక్తప్రసరణ జరగడం తగ్గిపోతుంది. దీనివల్ల రుతుక్రమం దెబ్బతినే అవకాశం ఉంది. కెఫిన్, ఆస్పరటేమ్, ప్రక్టోజ్ ఈ మూడింటినీ కలిపిన డ్రింక్స్ వల్ల శృంగార హార్మోన్లు, హార్మోన్ గ్రాహకాల పై చెడు ప్రభావం పడి వంధ్యత్వం ఏర్పడుతుంది.కాబట్టి సంతానం కోరుకునే దంపతులు ఇద్దరు సోడా, కూల్ డ్రింక్స్ కి తాగకుండా ఉండటం అన్ని విధాలా మంచిది.