మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందికి దగ్గు, జలుబు లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని తగ్గించుకోవడానికి హాస్పటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తది. అయితే చిన్న చిన్న వాటికే హాస్పటళ్ల దాకా ఎందుకు అని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే దగ్గును, జలుబును సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి మరి..
అల్లం, తేనే, నిమ్మ, గ్లిసరిన్ ను ఉపయోగించి మీ ఇంట్లోనే దగ్గు సిరప్ ను ఈజీగా మీ వంటింట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి అదేలాగో చూసేయండి మరి..అల్లం, తేనే, నిమ్మకాయతో తయారు చేసే దగ్గు సిరప్ తయారు చేసే విధానం..ముందుగా అల్లాన్నిచిన్న చిన్న ముక్కలుగా కోయాలి. దీనితో పాటుగా నిమ్మకాయల రసాన్ని తీసి తొక్కలను తురుముకోవాలి. వాటిని ఒకగిన్నెలో 1 కప్పు నీరు పోసి వాటిలో అల్లం ముక్కలను, ఒకటిన్నర లేదా రెండు చెంచాల నిమ్మకాయల తరుగును వేసి 5 నిమిషాల పాటు స్టౌ మీద మరిగించి దించాలి.
అది చల్లబడిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు తేనేను పోసి తక్కువ వేడి మీద ఉంచాలి. కాని మరిగించొద్దు. తేనే వేడైన వెంటనే వడకట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. తేనెలో అల్లం ద్రావణాన్ని వేసి కలుపుకోవాలి. అందులోనే రెండు నిమ్మకాయల రసాన్ని వేసి తక్కువ మంటపై వేడి చేసుకోవాలి. ఇంకేముంది తరువాత దించేసి నిలువచేసుకోవడమే.. దీన్ని ఏడాది నుంచి ఐదేండ్ల పిల్లలు రెండు గంటకు ఒక అర టీ స్పూన్ ను పట్టించాలి.
గ్లిజరిన్, తేనే, నిమ్మకాయతో దగ్గు సిరప్ తయారుచేసే విధానం..పావు కప్పు గ్లిజరిన్ ను ఒక గిన్నెలో వేసి అందులోనే పావు కప్పు తేనేను ఆ గిన్నెలోనే వేసుకోవాలి. అలాగే దానిలో పావు కప్పు నిమ్మ రసాన్ని కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరి ఇక ఈ సిరప్ తయారైనట్టే.. ప్రతి కొన్ని గంటలకు 1 టీస్పూన్ ఈ దగ్గు సిరప్ తీసుకోండి. మీ దగ్గును ఇట్టే తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దగ్గు సిరప్లు ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు.