హెల్త్

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

Share

టీ…. ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి అయితే టీ తాగానిదే అసలు పొద్దె గడవదు..కొందరికి టీ అలవాటు ప్రకారం తాగకపోతే తలనొప్పి కూడా వస్తుంది. అయితే మేము చెప్పే ఈ టీల గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. మళ్ళీ మళ్ళీ ఈ డిఫరెంట్ టైప్స్ టీలను తాగాలని మీకు అనిపిస్తుంది.

అల్లం టీ :

అల్లం టీ తాగితే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవడంతో పాటుగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎటువంటి తలనోప్పి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది.మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు అల్లం టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

చామంతి టీ :

చామంతి టీ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నిజానికి చామంతి టీ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడం, జీవక్రియ రేటు పెరగడం జరుగుతుంది. డిటాక్స్ ఎఫెక్ట్స్ కోసం వైద్య నిపుణులు గ్రీన్ టీని తాగమని సలహా ఇస్తూ ఉంటారు.. కండరాల విశ్రాంతి కోసం, శరీర నొప్పులు, మైగ్రేన్‌ల నుంచి ఉపశమనం పొందడంలో గ్రీన్ టీ మంచిగా పనిచేస్తుంది

తులసి టీ :

తులసి టీ తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తులసి టీ తాగాలి..ఇందుకు సాధారణ టీలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. దీన్ని తరచూ సేవిస్తుంటే తలనొప్పి నుంచి త్వరగా బయటపడొచ్చు.ఈ టీ తాగడం వలన ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.


Share

Related posts

అమ్మాయిలు  పడుకునే టప్పుడు కొందరు బ్రా తీస్తారు కొందరు తియ్యరు కారణం ఇదే!

Kumar

Mosquito: దోమల బెడద తగ్గాలంటే ఈ మొక్కతో ఇలా చేస్తే సరి..!

Ram

కలబంద రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Teja