Children: ఎంత బిజీగా ఉన్నా కూడా తల్లిదండ్రులు కాస్త సమయం పిల్లల కోసం కేటాయించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి .వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్లను ఇంకా శ్రద్ధగా చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల చేత శారీరకం అలసి పోయేలా ఆటలు ఆడించడం , పోషక ఆహారం ఇవ్వడం, నీళ్లు తాగుతున్నారా లేదా అని చూసుకోవడం,వారికీ ఒత్తిడి లేకుండా చేయడం వంటివి చూసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు కాన్స్టిపేషన్ సమస్యతో బాధ తో ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రులు ఈ ఆయుర్వేద చిట్కాల తో తగ్గించుకోవచ్చు.
అసలు పిల్లల్లో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అనేది ముందుగా తెలుసుకుందాం.
నీళ్ళు తక్కువగా తాగడం 2. జంక్ ఫుడ్ ను బాగా తీసుకోవడం
3 రాత్రి ఆలస్యంగా ఆహారం తినడం
4. లేట్ గా నిద్ర పోవడం
5. ఎప్పుడు పడితే అప్పుడు ఒక సమయం అనేది లేకుండా తినడం
5. సరిపడినంత ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడం
6. గట్ హెల్త్ సరిగా లేకపోవడం
ఈ సమస్య నివారణ కి ఇలా చేయండి..
ఉదయం పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తగ్గించండి. ఐదు ఎండు ద్రాక్షను నానబెట్టి తినడానికి ఇవ్వండి.
ఉదయాన్నే గోరు వెచ్చని ఆవు పాలలో.. ఒక టీస్పూన్ ఆవు నెయ్యి కలిపి ఇవ్వండి.
పిల్లలకు పెట్టె ఆహారం లో ఇంగువని వాడడం వల్ల గ్యాస్ సమస్యలు రావు.
పచ్చి ఆహార పదార్థాలు తినడం కంటే ఉడికించిన ఆహార పదార్థాలు తినే అలవాటు చేయండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా జంక్ ఫుడ్ పిల్లలకు అసలు పెట్టకండి .
పిల్లలకు సరిపడినంత ద్రవ పదార్థాలు ఇస్తుండాలి. శరీరం బాగా కలిసిపోయేలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేయండి .ప్రతి రోజు నిర్ణిత సమయానికి తినడం ,పడుకోవడం వంటివి కచ్చితం గా అలవాటు చేయండి.