Secrets: కొందరు అమ్మాయిలు తనకెదురైన ప్రతి చిన్న సంఘటన తను ప్రేమిస్తున్న వారితో పంచుకొంటూ ఉంటారు. మీ బంధం లో పారదర్శకత, నిజాయతీ ఉండాలి అనేది మీ ఉద్దేశం కావచ్చు. లేదా ఏ విషయమైనా సరే పంచుకొనే ఫ్రీడమ్ మీ భాగస్వామి దగ్గర మీకు ఉండి ఉండచ్చు. అలా ఉన్నాకూడా అన్నీ వారికి పూసగుచ్చి చెప్పాల్సిన పని లేదు. కొందరు అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నీకో విషయం తెలుసా అని మొదలు పెట్టి … ఈ రోజు మా ఫ్రెండ్ ఏం చేసిందంటే?అంటూ మొదలుపెట్టి.. తమ బెస్ట్ ఫ్రెండ్స్ నమ్మి చెప్పిన ఆమె పర్సనల్ విషయాలు కూడా బాయ్ ఫ్రెండ్‌కు చెప్పేస్తుంటారు. కానీ అది మీకు, మీ స్నేహితురాలికి మధ్య ఉండాల్సిన విషయం కదా..
దాని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మీ బాయ్ ఫ్రెండ్‌తో చెప్పడం తప్పు.. ఇది మనలో చాలామంది చేసే పొరపాటు. మీ స్నేహితురాలు తన విషయాలు.. ఎవరి దగ్గర మీరు చెప్పారు అనే గట్టి నమ్మకం తోనే మీకు చెప్పుకుంటుంది.మీరు ఇలా చెప్పేస్తే.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్టే . ఆమె సమస్యకు మంచి పరిష్కారం అందిస్తాడనే ఉద్దేశంతో మీరు మీ బాయ్ ఫ్రెండ్‌తో చర్చిస్తే పర్వాలేదు. కానీ ఏమి తోచక కబుర్ల కోసం మీ స్నేహితురాలి పర్సనల్ విషయాలు గురించి అతనితో చర్చించడం మాత్రం చాలా తప్పు. కాబట్టి ఇక నుండి మీ ఫ్రెండ్స్, వారి వ్యక్తిగత జీవితాల గురించి మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర మాట్లాడకండి.మరి కొందరు ‘నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి ఏం జరిగిందో తెలుసా?’అంటూ
మీ మాజీ ప్రియుడి గురించి మీ భాగస్వామి లేదా మీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కి చెబుతున్నారా? అయితే వెంటనే అలా చెప్పడం మానుకోండి. లేదంటే దీని వల్ల మీ ఇద్దరి మధ్య బంధం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మాజీ ప్రియుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అతనికి పెళ్లి అయిందా? అంటూ మీరు అతనిగురించి అనుకుంటున్నారు అంటే మీరు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నారు అనే అపోహ మీ ప్రస్తుత భాగస్వామికి వచ్చే అవకాశం ఎక్కువ .దీంతో అతను మీకు దూరంగా జరిగే అవకాశం ఉంది . నిజం చెప్పాలంటే.. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు అనే విషయం మీకే అనవసరం అలాంటిది ప్రస్తుత భాగస్వామికి చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇకపై మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చర్చించడం మానుకుంటే మంచిది .