హెల్త్

kaliyugam : కలి ప్రభావం వలన అష్టకష్టాలు పడకుండా ఉండాలి అంటే ఈ  ఒక్క పని చేయండి !!

Share

kaliyugam : కలియుగం అంటారు కదా  అస్సలు ఈ కలియుగం అంటే ఏమిటి ?   కలి  మనలో ఎలా ప్రవేశిస్తుంది? కలి ప్రభావం  నుండి మనం ఎలా తప్పించుకోగలం ? అనే విషయాలు తెలుసుకుందాం.

kaliyugam : ఈ యుగం చాల దారుణంగా

ఇప్పుడు మనం ఉన్న యుగాన్నే  కలియుగం  అని అంటారు.  ఈ యుగం మిగతా యుగాలకంటే చాలా  వేరుగా ఉంటుంది. ఈ యుగం పూర్తి కాగానే సృష్టి అంతా అంతమై పోయి తిరిగి  మళ్ళి యుగాలు ప్రారంభం అవుతాయి.
కలియుగం  లో ఉండే  కలిపురుషుడు ప్రభావం వల్ల ఈ యుగం చాల దారుణంగా ఉంటుంది.
కలియుగంలో కలిపురుషుడు ప్రభావం ఉండడం చేత   దేవతలకు హవిస్సులందవు.
వేదము కూడా అవమానింపబడుతుంది.
పితృదేవతలకు శ్రాద్ధం  పెట్టేవారు  తక్కువ మంది   ఉంటారు.
ధర్మం , భూమాత, గోమాత అవమానింపబడతాయి.
అసత్యం పలకడం , బంగారం, డబ్బు చాల  ముఖ్యమైనవి గా భావిస్తారు.
కష్టపడినవారికి ఫలితం తక్కువగా ఉంటుంది.
కష్టపడని వారికి ఫలితం ఎక్కువ గా ఉంటుంది.
శాస్త్రీయత  పేరుతో  దైవభక్తి  అంతరించి పోతుంది.
మనుషులలో నీతి నిజాయితీ  కరువైపోతాయి.
దానధర్మాలు అనేవి ఉండవు.
తల్లిదండ్రులు, అత్తమామలు అంటే గౌరవం ప్రేమ  అక్కాచెల్లెళ్లు,  అన్నదమ్ముల మధ్య  అనుబంధాలు తగ్గిపోతూవుంటాయి.
చివరికి కలి  ప్రభావం ఎక్కువై  కరువులు , వరదలు, యుద్దాలు,  ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది.
అసలు  కలి  ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో తెలుసా ?.

ఒక్కసారైనా దైవ స్మర
జూదం ఆడే వారిలో , మద్యం తీసుకునే వారిలో
వ్యభిచారం చేసే వారిలో ,జీవహింస చేసే వారి లో కలి ఎక్కువగా ప్రవేశిస్తాడు.
మొదట జూదం లోనించి
అసత్యం  లోకి , మద్యం ద్వారా మదం, అహంకారం లోకి వ్యభిచారం లోనించి కామవాంచ, హింసాలోంచి కోపం, లోకి  ప్రవేశించాడు కలి.

ఈ కాలం పేరే కలి కాలం అవడం వలన కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు.  ఈ యుగం లో ధర్మ అడుగంటి  పోతుంది కాబట్టి  మనం ఎవరికైనా  చిన్న సాయం చేసిన కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం .
అలాగే మనస్ఫూర్తిగా రోజు  లో ఒక్కసారైనా దైవ స్మరణ చేసిన చాలు కలి
దాన  ధర్మాలు చేచేయడం వలన   కలి ప్రభావం తగ్గుతుంది.  వీటి తో పాటు పెద్దల శ్రద్ద కర్మలు  తప్పకుండా  చేయడం,  నోరు లేని జీవాలను ఆదరించడం వలన కూడా  కలి ప్రభావం తగ్గుతుంది.
కాశీకి వెళ్లినట్టు మనసులో తలచుకొన్న కూడా కలి నుండి మనం కొంత  రక్షణ కలుగుతుంది.
దైవ సంబంధమైన  కార్యక్రమాలలో , భజనల లో,  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  పాల్గొన్న కూడా కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.
ప్రతి ఒక్కరు రోజుకి  ఒక్కసారైనా క్రింది పద్యాన్ని  స్మరిస్తే కలి భయం  అనేది ఉండదు.

“కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలి నాశనం!
దమయంతి నలాబ్యాంచ ప్రణమామి పునః పునహా”
కాబట్టి ఈ పద్యాన్ని చదువుకుని కలి బాధ నుండి రక్షణ పొందండి.


Share

Related posts

మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా .. వెంటనే ఈ పాయింట్స్ తెలుసుకోండి !

Kumar

Addasaram: అడ్డసరం సర్వరోగనివారిణి..!! ఎలా ఉపయోగించాలంటే..!?

bharani jella

Copper: రాత్రి రాగిబిందె లో ఉంచిన నీళ్లు ఉదయం తాగితే..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar