Children: ఆడవారికి అమ్మ అవడం కన్నా గొప్పది ఏది ఉండదు.. అయితే మీరు కొన్ని రకాల పనులకు దూరం గా ఉంటే … మీరు త్వరగా అమ్మ అవుతారు అని గుర్తు పెట్టుకోండి .. సిగరెట్ కాల్చడం వల్ల ఇటు ఊపిరితిత్తులు , నోరు వంటి అవయవాలు దెబ్బతినడం తో పాటు.. శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువయిపోతాయి. ఇది ఫెర్టిలిటీ ని కూడా తగ్గించేస్తుంది . గర్భం దాల్చడం లో సమస్యలు ఏర్పడతాయి. అందుకే పొగతాగడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
గర్భం ధరించాలి అనే ఆలోచన రాగానే ఆల్కహాల్ కి దూరమవడం ఇంకో మంచి పని అని గుర్తు పెట్టుకోండి. కెఫీన్ మన శరీరంలో జీవక్రియలు వేగంగా సాగే విధంగా చేస్తుంది. శరీరంలో అండం ఎక్కువ సేపు జీవించకుండా కూడా చేస్తుంది. కాబట్టి అమ్మకావాలనుకున్నప్పుడు కాఫీ, టీలు బాగా తగ్గించాలి. రోజులో 2 రెండు కప్పుల టీ లేదా కప్పు కాఫీ మాత్రమే తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.గర్భం ధరించడానికి అవరోధం గా ఉండే కారణాల్లో ఒత్తిడి చాలా ముఖ్యమైంది గా ఉంది . ఒత్తిడికి గురవడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరగడం,బరువు పెరగడం , పీరియడ్స్ సమయానికి లేకపోవడం , అండాలు విడుదల లేకపోవడం, ఫెలోపియన్ ట్యూబ్స్ లో సమస్యలు వంటివి ఎదురవుతాయి. అందుకే గర్భం ధరించాలనుకున్నప్పుడు ఒత్తిడిని తగ్గించేందుకు ముందుగా ప్లాన్ చేసుకోండి. గర్భం కావాలి అంటే బరువు తగ్గాలని అని వెయిట్ ఎక్సర్ సైజులు, చాలా ఎక్కువ బరువులు ఎత్తడం, ఏరోబిక్స్ వంటివి చేయకూడదు.
ముందు బరువు తగ్గి ఆ తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నెమ్మదిగా తేలికపాటి వ్యాయామాలు చేయడం లేదా నడక వంటి వాటిని ఎంచుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి.పిల్లలు కోసం ఎంత కాలం ఎదురు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చాలా మందికి అనుమానం వస్తుంటుంది. ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు పాటించకుండా సంవత్సరం రోజుల పాటు ఉన్నా కూడా గర్భం రాకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది. అయితే 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీలు మాత్రం కేవలం ఆరు నెలల పాటు గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.