positive: ఇతరుల గురించి పాజిటివ్ గా మాత్రమే ఆలోచించడం మొదలు పెట్టండి. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ పూర్వక ఆలోచనలు కలిగి ఉండండి. ప్రేమ-దయ గురించి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయవచ్చు. అది ఈ విధంగా చేయాలి. ముందు సౌకర్యవంతంగా కూర్చోండి. తర్వాత మీ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు గాఢంగా ఊపిరి తీసుకుని గాలి వదలండి. మీ శరీరం మొత్తం రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మీ శరీరం అంతా తేలికగా అవుతుంది.మీకు బాగా ఆనందాన్ని ఇచ్చే ఏదైనా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ ఆనందాన్ని మీ గుండెల నిండా నింపుకొని, ఇంత ఆనందం ఇచ్చినందుకు దైవానికి మీ కృతజ్ఞతలు తెలుపుకొండి. రెండు చేతులను ఆశీర్వదిస్తున్న టు గా పెట్టి వాటి ద్వారా ప్రేమను, ప్రశాంతతని మీ కుటుంబ సభ్యులకు పంపుతున్నట్టు భావించండి. ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోండి.
ప్రేమను, ప్రశాంతతని మీరు ఉన్న ప్రదేశం మొత్తానికి పంపుతున్నట్టు, మీరున్న నగరానికి పంపుతున్నట్టు
మీ రాష్ట్రానికి పంపుతున్నట్టు, మీ దేశానికి పంపుతున్నట్టు ఈ ప్రపంచం మొత్తానికి పంపుతున్నట్టు భావించండి.
ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ఆరోగ్యంగా ,ఆనందంగా ,సమృద్ధిగా, ప్రశాంతంగా ఉన్నట్టు ఊహించుకోండి.
మెల్లగా మీ చేతులు మీ ఒడిలో పెట్టుకుని.
positive: 40 సెకన్ల పాటు నిశ్శబ్దంగా కూర్చుని మీతో మీరు కనెక్ట్ అవ్వాలి.
మీరు పూర్తిగా ప్రేమతో, దయ తో నిండి ఉన్నట్టు ఊహించుకుని, దయ మీ తల భాగం నుండి మీ శరీరం లోనికి ప్రవహించి మీ శరీరంలో ఉన్న ప్రతి అణువులో నిందుతున్నట్టు గా ఊహించుకోండి.
మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రేమతో, కరుణతో మరియు బలంగా ఉన్నట్లు ఊహించడం,మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోండి .
ఇప్పుడు మెల్లిగా మీ కాళ్లు చేతులు కదిపి మీ చేతులు రుద్దుకొని మీ కళ్ళకు పెట్టుకుని మీ ముఖాన్ని మెల్లగా రుద్దుకుంటూ పెద్ద నవ్వుతో కళ్ళు తెరిచి చూడండి.
మన జీవితంలో దయ కలిగి ఉండటానికి కొన్ని మార్గాలు ఇవి. మీరు నెగిటివ్ ఆలోచనలు, నెగటివ్ ఎమోషన్స్ తో ఉన్నప్పుడు దయకు సంబంధించిన ఒక పని ఏదైనా చేయండి. లేదా మెడిటేషన్ చేసుకోండి. దయ మన మూడ్ ని ఆనందం గా ఉండేలా చేస్తుంది. కాబట్టి దయని అలవాటు చేసుకోండి. దయ కలిగిన ఒక పని చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు పాజిటివ్ గా మార్చ గలుగుతారు. దయతో చేసిన ఎంత చిన్న పనిఅయిన పెద్ద ప్రభావం చూపిస్తుంది.