Dry fruits: డ్రై ఫ్రూట్స్  ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!!

Afghanistan Taliban Crises: Major Effect to India soon?
Share

Dry fruits: డ్రై ఫ్రూట్స్  నిల్వ  డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం పాటు  నిల్వ చేయడం వల్ల వాటికి పురుగులు  పట్టవచ్చు.  ఇలా  జరగకుండా  ఉండాలంటే వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో  పెట్టుకోవాలి.

కమ్మని  రైతా  కోసం…
కొన్ని సార్లు  మనం తినే సమయానికి కొన్ని గంటల ముందు రైతా తయారు చేసి పెట్టుకుంటారు. దీని వల్ల రైతా పుల్లగా అవుతుంటుంది . అందుకే ముందుగా పెరుగు లో  కూరగాయలు.. మిగిలిన పదార్థాలన్నీ  వేసి పక్కన పెట్టుకుని..   ఉప్పు మాత్రం   దాన్ని వడ్డించే   ముందు  వేసుకోవడం  వల్ల రైతా  పులుపెక్కాకుండా ఉంటుంది.

ఆలూ పరాఠా  ..
చాలా సారులు  ఆలూ పరాఠా చేసేటప్పుడు ఒత్తుతుంటే లోపల పెట్టిన  మిశ్రమం బయటకు వచ్చేస్తుంటుంది. అలా  రాకూడదు అనుకుంటే నెమ్మదిగా  ఒత్తుకోవాలి… అది కూడా ముందు అంచుల దగ్గర  కాకుండా మధ్యలో వత్తుతూ.. తర్వాత  అంచులు వత్తాలి సి  ఉంటుంది. ఇలా చేస్తే పరాఠాలు  చక్కగా ఉంటాయి.

అల్లం పేస్ట్  నిల్వ
అల్లం పేస్ట్  నిల్వ చేసుకోవాలి అనుకున్నప్పుడు   అందులో చెంచా ఆవాల నూనె  వేస్తె అల్లం పేస్ట్ పాడవకుండా తాజాగా ఉంటుంది.

గుడ్ల లో ఉప్పు ..
గుడ్లు ఉడకబెట్టి నీటిలో ముందు ఒక అర చెంచా ఉప్పు వేసి.. తర్వాత గుడ్లు నెమ్మదిగా అందులో వేసి  ఉడికిస్తే   పగలకుండా బాగా ఉడుకుతాయి.

మాడిపోయిన గిన్నెలు  తళతళ ..
వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలు మాడిపోవడం అనేది చాలా  సహజం గా జరుగుతుంటుంది. వీటి మాడును వదిలించడానికి  ఇందులో కాస్త టీ పొడి, నీళ్లు పోసి  కొద్దీ సేపు  పక్కన పెట్టాలి. ఆ తర్వాత తోమితే గిన్నెలు  శుభ్రపడతాయి.

పువ్వుల ఇడ్లీ..
పిండి రుబ్బుకుని తర్వాత అందులో కొంచెం  అన్నం మిక్సీలో మెత్తగా చేసి  కలుపుకోవాలి. లేదా బేకింగ్ సోడా లేక ఈనో కూడా వేయడం   వల్ల ఇడ్లీలు చాలా  మెత్తగా వస్తాయి.

తేలికగా రాజ్మా ఛోళే
సాధారణంగా ఛోళే చేయాలంటే రాజ్మా, శనగలు, బఠానీలు ఇలా వేటినైనా రాత్రంతా నానబెట్టాలి  . అంత సమయం   లేకపోతే మరుగుతున్న నీటిలో వాటిని వేసి నానబెడితే   గంటలోనే అవి నానిపోయి ఉడకబెట్టడానికి సిద్ధంగా  ఉంటాయి.


Share

Related posts

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద మన‌సు … క‌రోనా టైంలో కీల‌క నిర్ణ‌యం

sridhar

Romance: ప్రతి రోజు శృంగారం  వలన ఏమి జరుగుతుందో తెలుసా  ??

siddhu

కాఫీ ఇచ్చింది.. జైలుపాలైంది.. కారణం తెలిస్తే షాక్ ?

Teja