Eye Care: ముఖం యొక్క అందం తగ్గించే సమస్యలు ఉబ్బిన కళ్ళు కూడా ఒకటి. కళ్ళ చుట్టూ ఉన్న చర్మం ఉబ్బడం వల్ల కాళ్ళ కింద ఉబ్బుగా కనిపిస్తుంది. అలసట,నిద్ర లేకపోవడం, ఎక్కువ ఏడవడంవంటి వాటివల్ల కూడా కళ్లు ఉబ్బుతుంటాయి. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు తో వీటిని తగ్గించుకోవచ్చు.
ఉబ్బిన కళ్లు , కళ్ల కింద సంచులు ఏర్పడటం తగ్గాలంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గడం వలన కూడా కళ్ల ఉబ్బులు వస్తాయి. దీనికోసం ఎక్కువ నీరు తాగుతుండాలి. ముఖాన్ని తరచుగా చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల కాళ్ళ ఉబ్బు తగ్గుతుంది.బంగాళా దుంపలు ఫ్రిజ్ లో పెట్టి.. రెండు స్లైసెస్ కోసి వాటిని కళ్ళ మీద పెట్టుకుని 10-15 నిమిషాలు ఉండనివ్వండి. ఇలా చేయడం తో కళ్ళకు ఉపశమనం ఉంటుంది. కళ్ల నుంచి నీరు కారడం కూడా తగ్గుతుంది. కళ్ళ ఉబ్బును తగ్గించడం లో కీరా దోసకాయ కూడా బాగా పనిచేస్తుంది. పది నిముషాలు కీరా ముక్కలను ఫ్రిజ్లో ఉంచి, ఆ తరువాత కళ్ళ మీద 15 నిమిషాలు పెట్టుకుంటే ఇది కళ్ల ఉబ్బును తగ్గించడంలో సహాయపడుతుంది.
కళ్లు ఉబ్బు తగ్గించడం లో అలోవెరా జెల్ అద్భుతం చేస్తుంది . దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కళ్ళ క్రింద వాపు ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ ను కాసేపు ఫ్రిజ్ లో పెట్టి ఆ తరువాత ఉబ్బిన కళ్ల దగ్గర రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.