couples: శృంగారం చేసిన తర్వాత అలసిపోయి నిద్ర పోవడం లేదా నిశ్శబ్దం గా విశ్రాంతి తీసుకోవడం అనేది ఆలుమగల మధ్య చాలా సహజంగా జరిగే విషయం. అయితే శృంగారం ముగిసిన తర్వాత చేసే కొన్ని పనులు మీ మధ్య బంధం మరింత పటిష్టం గా ఉండటానికి ముఖ్య పాత్ర వహిస్తాయి . శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసేందుకు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.శృంగారం లో పాల్గొన్న తర్వాత అందరు సహజం గా చేసే పని జననాంగాల ను శుభ్రం చేసుకోవడం లేదా స్నానం చేయడం. అయితే ఈ పనుల్లో ఒకరికొకరు సహాయం గా ఉండి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ట్రై చేయండి . దీని వలన ఒకరిపై మరొకరికి కేరింగ్ పెరుగుతుంది.
శృంగారంలో పాల్గొనడం పూర్తైన తర్వాత ఒక పని అయిపొయింది బాబు అన్నట్టుగా ఎవరికి వారు ఉండకుండా తిరిగి బట్టలు వేసుకోవడం లో ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఇది కూడా మీ ఇద్దరినీ మరింత దగ్గర వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
శృంగారం పాల్గొన్న తర్వాత మీ ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోకుండా మీరు శృంగారం చేస్తున్నప్పుడు ప్రయత్నించిన కొత్త మూవ్స్ గురించి లేదా మీకు కసి పెంచిన విషయం గురించి మాట్లాడండి.
దీనివలన మీ భాగస్వామి ఇష్టాఇష్టాల గురించి తెలుసుకునే అవకాశం దక్కి ఎక్కడైనా పొరపాటు జరుగుతున్న దిద్దుకునే అవకాశం ఉంటుంది.శృంగారంలో పాల్గొనే సమయంలో మాత్రమే కాదు.. అది పూర్తయిన తర్వాత కూడా ఆలుమగలిద్దరూ ఒకరిని మరొకరు ముద్దులాడి, సరదాగా ఆట పట్టించుకోవడం, కౌగిలించుకోవడం..ప్రేమ పూరిత స్పర్శ అందివ్వడం వంటివి చేయాలి. ఆరోగ్యకరమైన దాంపత్య బంధానికి ఇవి పునాదులవుతాయి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.