హెల్త్

Fish: చేపలలో ఉండే “వాటిని “ తినకుండా పడేస్తున్నారా ?అయితే మీరు  ఈ విషయం తెలుసుకోవాలిసిందే !!

Share

Fish: చేపలు తింటే  కలిగే  ఆరోగ్య ప్రయోజనాల తో పాటు     చేప గుడ్లు తింటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు  అనేది తెలుసుకుందాం.  అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపిన వివరాల ప్రకారం…
కీళ్ల నొప్పులు తగ్గేలా  చేయడం లో  చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాగా పనిచేస్తాయి.  నోటి  , గొంతు  , పెద్దపేగు, పాంక్రియాటిక్  క్యాన్సర్లు  రాకుండా ఉంటాయి  అని  వెల్లడించడం జరిగింది.ఆహారంలో చేపలు  ఎక్కువగా తీసుకోవడం    వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి అని   అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ  కి ఓ అధ్యయన వివరాలను  తెలియజేశారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్ల ను తగ్గించడం వలన    రక్తనాళాల్లో   అడ్డంకులు ఏర్పడి , గుండె జబ్బులు రాకుండా రక్షణ కలుగుతుంది.

ఆడవారికి   పీరియడ్స్ సరిగా  రావాలన్న, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు  రాకుండా ఉండటానికి .. తరచూ చేపలు  తింటూ ఉండాలి అని  డాక్టర్స్ తెలియచేస్తున్నారు .వయస్సు  పెరిగేకొద్దీ చాలా  సహజంగా వచ్చేది మతిమరుపు  . కొందరి లో  ఇది విపరీతమైన అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారికి  ఆహారం లో చేపలు ఎక్కువగా ఉండేలా చూడటం   వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు అని కొందరు   అమెరికా సైంటిస్టులు   2016 లో చేపట్టిన పరిశోధనలో బయట పడింది. చేపలు తినడం వల్ల  మెదడు పనితీరు అద్భుతం గా ఉండి…  జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది అని  వారు వివరిస్తున్నారు.చేపలు ఎక్కువగా  తినడం వల్ల వాటిలో ఉండే డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ తగ్గేలా చేస్తాయి. ప్రతి రోజు  ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన దరిచేరవు అని  సైంటిస్టులు చేసిన  పరిశోధనలోతేలింది.

ఇంతవరకు బాగానే ఉన్న కొంత మంది   అసలు చేప గుడ్లు తినడానికి ఇష్టపడరు.  ఇకపై అలా చేయవద్దని ఆరోగ్య నిపుణులు  తెలియచేస్తున్నారు… చేప గుడ్లు తప్పనిసరిగా తినాలి అని  సూచిస్తున్నారు. ఎందుకంటే వాటిలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.చేప గుడ్ల లో  ఉండే విటమిన్ A   కంటి చూపును రక్షిస్తుంది. కళ్ళకు ఎటువంటి  హాని  కలగకుండా చేస్తుంది. చేప గుడ్లు   క్రమం తప్పకుండా  తింటూ ఉంటే    రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడం తో పాటు రక్త శుద్ధి జరుగుతుంది. రక్తహీనత  సమస్య ఉన్నవారికి   చేప గుడ్లు  అద్భుతంగా పనిచేస్తాయి. చేప గుడ్లలో ఉండే విటమిన్ D  ఎముకలు, దంతాలు బలంగా  చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా కూడా విటమిన్ D  రక్షణ కల్పిస్తుంది .మతిమరుపు ఉన్నవారు, అల్జీమర్స్ ఉన్నవారు  కచ్చితంగా చేప గుడ్లు తినాలి.  హైబీపీ ఉన్నవారు  చేప గుడ్లు  తినడం వలన అవి మీకు  మేలు చేస్తాయి. చేప గుడ్లను  ఫ్రై  ,   లేదా ఇతర కూర కూడా  వేసుకోవచ్చు.  అన్నం తో కూడా  తినవచ్చు. ఎలా తిన్నా ప్రయోజనమే… కాబట్టి ఇంకనుంచి వాటిని పడేయడం ,వదిలేయడం వంటివి అస్సలు చేయకండి.


Share

Related posts

Carrot juice : రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌ లో కొంచెం ఏలకుల పొడి, పటికబెల్లం వేసి తాగితే  ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు!!

Kumar

Sannajaji: ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!!

bharani jella

Vitamin C: ఇవి తినట్లేదా..!? అయితే పొట్ట రావడం ఖాయం..!!

bharani jella